Krishna Kowshik
నా అనుకున్న వాళ్లే నన్ను మోసం చేశారు. ఇన్ని రోజులు నెేనేలా గడిపానో నాకే తెలుసు. నేను లేకుండా తల్లిదండ్రులు, భార్యా భర్తలు బతుకలేరు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని ఓ వ్యక్తి తీవ్ర ఆలోచన చేసి.. కుటుంబ
నా అనుకున్న వాళ్లే నన్ను మోసం చేశారు. ఇన్ని రోజులు నెేనేలా గడిపానో నాకే తెలుసు. నేను లేకుండా తల్లిదండ్రులు, భార్యా భర్తలు బతుకలేరు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని ఓ వ్యక్తి తీవ్ర ఆలోచన చేసి.. కుటుంబ
Krishna Kowshik
ఆర్థిక వ్యవహారాలు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడమే కాదూ.. ప్రాణాలు బలిగొంటున్నాయి. ఆర్థిక అవసరాల కోసం అప్పులు చేస్తూ.. వాటిని తీర్చలేక చనిపోతుంటారు. అయితే అప్పు తీసుకోవడమే కాదూ.. ఇచ్చినప్పుడు కూడా సమస్యలు ఎదుర్కొంటుంటారు కొందరు. ఏదో వడ్డీ వస్తుందని ఆశపడితే, లేదా స్నేహితుడు ఆపదలో ఉన్నాడని జాలి చూపించి.. దాచుకున్న డబ్బులు ఇస్తుంటారు. అయితే.. ఇవ్వాలన్న మనస్తత్వం, ఆపద కాలంలో స్నేహితుడు ఆదుకున్నాడన్న కృతజ్ఞత భావం ఉన్నవాళ్లు తిరిగి ఇచ్చేస్తారు. కానీ మోసం చేసే మనస్తత్వం ఉంటే.. డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. ఇచ్చిన వ్యక్తులను బెదిరించడం, హింసకు, మానసిక ఆవేదనకు గురి చేస్తుంటారు.
ఇదే ఓ వ్యక్తి కుటుంబంలో సామూహిక హత్యలకు కారణమైంది. సూరత్‌లో కుటుంబంలోని ఏడుగురు ఒకేసారి మరణించడం సంచలనం రేపింది. అయితే అంతా ఆత్మహత్యే చేసుకున్నారు కానీ.. కుమారుడు కుటుంబ సభ్యులను చంపి, ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే వృతిరీత్యా ఇంటీరియర్ డిజైనర్, ఫర్నీచర్ వ్యాపారి అయిన మనీష్ అలియాస్ శాంతు సోలంకి భార్య రేష్మ అలియాస్ రీటా(30)తో వివాహం అయ్యింది. అతడి వద్దే తల్లిదండ్రులు కాను (70), శోభన (68) ఉంటున్నారు. మనీష్, రీటా దంపతులకు ఇద్దరు కుమార్తెలు దిశ (13), కావ్య(10), కుశల్ (6) ఉన్నారు. అయితే వీరంతా శనివారం ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు వీరంతా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారని భావించారు.
వీరిలో మనీష్.. మాత్రం ఉరి కొయ్యకు వేలాడుతుండటంతో పోలీసులకు అనుమానం రాగా, ఇల్లంతా వెతకగా.. సూసైట్ నోట్ దొరికింది. అందులో తాను ఒకరికి డబ్బులు ఇచ్చానని, నగదు తీసుకున్న వ్యక్తి తనను ద్రోహం చేశాడని పేర్కొన్నాడు. అయితే ఎంత తీసుకున్నాడు.. వారెవ్వరో పేర్లను రాయలేదు. తన జాలి,దయే కొంప ముంచిందని, అప్పు తీసుకున్న తర్వాత తిరిగి ఇవ్వడం లేదని రాసుకొచ్చాడు. ఈ మరణం వెనుక కొన్ని వ్యక్తిగత కారణాలున్నాయని, తాను బ్రతికి ఉండగా.. అతడిని ఇబ్బంది పెట్టలేదని, చనిపోయాక కూడా ఇబ్బంది పెట్టడం తనకు ఇస్టం లేదని పేర్కొన్నాడు. తన జీవితంలో చాలా మందికి సాయం చేశానని, ఎవ్వరూ తనకు సాయం చేయలేదంటూపేర్కొన్నారు.
ఇన్ని రోజులు తానెలా బతుకుతున్నానో తనకే తెలుసునని, తాను లేకుండా భార్యా పిల్లలు, తల్లిదండ్రులు ఉండరని భావించాడు. తాను తన సోదరి సాయం కూడా కోరినట్లు అందులో పేర్కొన్నాడు. అయితే ఈ మృత దేహాలన పోస్టు మార్టం నిమిత్తం పంపగా.. భార్య రేష్మ, దిశాలను గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మనీష్ ఫర్నీచర్ కాంట్రాక్టులు తీసుకునేవాడని, అతడి వద్ద 35 మంది కార్పెంటర్లు, కార్మికులు పనిచేస్తున్నారు. శనివారం ఉదయం మనీష్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అతడి ఇంటికి వెళ్లగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎవ్వరూ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి బంధువులను సంప్రదించగా.. కిటీకి పగుల గొట్టి లోపలికి ప్రవేశించగా.. మృతదేహాలు కనిపించాయి. మనీష్ మాత్రం ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది.