Krishna Kowshik
ఈ ఫోటోలో ఓ కుటుంబం కనిపిస్తుంది కదా.. బయటకు వెళుతున్నామని చెప్పి వెళ్లి.. ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్లు చేసినా స్విచ్ఛాప్ వచ్చింది. మిస్సింగ్ కేసు నమోదైంది. విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ ఫోటోలో ఓ కుటుంబం కనిపిస్తుంది కదా.. బయటకు వెళుతున్నామని చెప్పి వెళ్లి.. ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్లు చేసినా స్విచ్ఛాప్ వచ్చింది. మిస్సింగ్ కేసు నమోదైంది. విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Krishna Kowshik
ఈజీ మనీ కోసం తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కుతున్నారు కొందరు. ఇతరులను మోసం చేస్తున్నామా అన్న కించిత్ బాధ లేకుండా.. తాము ఎంత జల్సాగా బతికామా అన్నదే చూస్తున్నారు. దీంతో నమ్మిన వ్యక్తులను నట్టేట ముంచుతున్నారు. పక్కనోడి నెత్తిన చేతులు పెడుతున్నారు. జనం సొమ్ముతో పబ్బం గడుపుకుంటున్నారు. మోసం చేస్తూ అందిన కాడికి దోచేస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు పోగయ్యాక.. పెట్టా, బేడా సర్దుకుని రాత్రికి రాత్రి కుటుంబంతో సహా చెక్కేస్తున్నారు. తెల్లారితే కానీ.. తాము మోసం పోయామని తెలియడం లేదు జనాలకు. ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు తరచుగా జరుగుతున్నాయి. అప్పులు తీసుకోవడమే కాకుండా.. చీట్ల పేరుతో డబ్బులు తీసుకుని.. తిరిగి ఇవ్వకుండా పంగనామం పెట్టడమే కాకుండా, మూడో కంటికి కనిపించకుండా ఉడాయించేస్తున్నారు.
మెదక్ జిల్లాలోని తుఫ్రాన్‌లో ఓ కుటుంబం రెండు రోజుల నుండి కనిపించడం లేదు. ఇద్దరు పిల్లలతో బయటకు వెళ్లిన భార్యా భర్తలు.. తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ అని రావడంతో.. ఆందోళనలో మునిగిపోయారు గ్రామస్థులు. వారు కానరాకపోతే.. వీరు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే.. ఊరి వాళ్ల సొమ్ములను తీసుకుని ఉడాయించింది ఈ ఫ్యామిలీ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజిలిపురం యాదగిరి, భార్య జ్యోతి, తన ఇద్దరు పిల్లలతో తుఫ్రాన్‌లో జీవిస్తున్నాడు. అతడు చిట్టీల వ్యాపారం చేసేవాడు. పెద్ద పెద్ద చీటీలు వేసేవాడు. అయితే సోమవారం పెద్దగుట్టకు వెళ్తున్నామని చెప్పి.. బయటకు వెళ్లిన కుటుంబం, ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, స్థానికులు ఫోన్ చేసినా.. ఇద్దరి ఫోన్లు స్విచ్ఛాఫ్ అని వచ్చాయి.
పెద్దగుట్టకు వెళ్లి వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. యాదగిరి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పుడు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిట్టీల పేరుతో అమాయకుల నుండి రూ. 30 కోట్ల రూపాయలు వసూలు చేశాడని, సుమారు 70 మంది బాధితులున్నారని తేలింది. వీరి కనిపించకపోవడంతో చిట్టీ బాధితులు లబోదిబోమంటూ.. పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెడుతున్నారు. తుప్రాన్ పోలీస్ స్టేషన్‌లో యాదగిరిపై అనేక మంది ఫిర్యాదులు చేశారు. కంప్లయింట్స్ స్వీకరించిన పోలీసులు.. అతడిని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.