iDreamPost
android-app
ios-app

కొడుకును చూడనివ్వలేదని జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య

కొడుకును చూడనివ్వలేదని జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య

సమాజం ఏదో అంటుందని, పెళ్లీడు వచ్చిందని ఇంకా పెళ్లి చేయరా అంటూ ఇరుగు పొరుగు మాటలకీ, అందరికీ పెళ్లి అయిపోతుంది.. నీవెప్పుడు, పప్పన్నం ఎప్పుడు పెడతావని బంధువులు అడుగుతున్నారని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత పర్యావసనాలను భార్య భర్తలు మాత్రమే ఎదుర్కొవలసి ఉంటుంది. పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించిన వాళ్లెవ్వరూ అప్పుడు రారు. ఇవి తెలిసినా కూడా తప్పని పరిస్థితుల్లో తలవంచక తప్పడం లేదు కొన్నిసార్లు. అయితే ఆ తర్వాత దంపతుల మధ్య మనస్పర్థలు, ఇగోలు, ఇతర కారణాల వల్ల పొరపచ్చాలు ఏర్పడుతున్నాయి. దీంతో పిల్లల కోసం కాంప్రమైజ్ అయ్యి బతికేస్తున్నారు. మరికొంత మంది విడిపోయి బతుకుతున్నారు. వీరి సమస్యల్లో పిల్లలు నలిగిపోతున్నారు. అయితే పిల్లలు ఎక్కువగా తల్లి దగ్గరే ఉండటం, తండ్రి ప్రేమకు దూరం అవుతుంటారు. పిల్లల్ని వదిలి ఉండలేని తండ్రి వారి వద్దకు వెళ్లినా అత్తింటి వారు చూపించకపోవచ్చు. ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి విషయంలోనూ ఇదే జరిగింది. దీంతో అతడు మనస్థాపానికి గురై ప్రాణాలను తీసుకున్నాడు.

భార్య గొడవపడి, బిడ్డతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. తన కుమారుడ్ని చూసేందుకు వెళ్లగా.. భార్య, అతడి అత్తింటి వారు అవకాశం ఇవ్వకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్తగూడెంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం పరిధిలోని నేతాజీ బస్తీకి చెందిన సింగారపు భరత్ కుమార్, సుభద్రలకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు ప్రేమ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్నాడు. ఇతడికి హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన యువతిలో వివాహం కాగా, వీరికి ఐదేళ్ల కుమారుడు చెర్రీ ఉన్నాడు. అయితే భార్యా భర్తల మధ్య గొడవలు జరగడంతో ప్రేమ్ భార్య అతడ్ని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే తన కుమారుడ్ని చూసేందుకు ప్రేమ్ వెళ్లగా.. అవమానించారు అతడి అత్తింటి వారు. బాబును చూడకుండా ఉండలేని ప్రేమ్.. మనస్థాపానికి గురై.. ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి సోదరుడు రాజ్ కుమార్ ఆదివారం నిద్ర లేచి చూడగా ఉరి కొయ్యకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.