Krishna Kowshik
మహిళలు సైతం దారుణాలకు ఒడిగడుతున్నారు. అక్రమ సంబంధాల మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేరుస్తున్నారు. తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితోె కలిసి చంపేసి.. కుటుంబ సభ్యుల ముందు కల్లబొల్లి ఏడుపులు ఏడుస్తున్నారు.
మహిళలు సైతం దారుణాలకు ఒడిగడుతున్నారు. అక్రమ సంబంధాల మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేరుస్తున్నారు. తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితోె కలిసి చంపేసి.. కుటుంబ సభ్యుల ముందు కల్లబొల్లి ఏడుపులు ఏడుస్తున్నారు.
Krishna Kowshik
పెళ్లి వ్యవస్థపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. భార్యా భర్తల్లో ఒకరు పరాయి వ్యక్తుల మోజులో పడిపోతున్నారు. మంగళ సూత్రాన్ని పరమ పవిత్రంగా భావించే మహిళలు.. అక్రమ సంబంధాల కారణంగా అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు తమ తాళిని తామే తెంచేసుకుంటున్నారు. ప్రియుడితో కలిసి కట్టుకున్న భాగ స్వామిని చంపి.. తమ ఐదో తనాన్ని.. తామే చెరిపేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి ఘోరాలు ఎక్కువయ్యాయని చెప్పొచ్చు. అయితే చంపేసి తప్పించుకునే క్రమంలో సినిమాటిక్ కథలను అల్లుతున్నారు. ఎంతలా అంటే కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసులు కూడా నమ్మేసేంతలా. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ కూడా అదే బాపత్తు. భర్తను చంపి ఏం కట్టుకథ అల్లిందో చూడండి..
ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు లత. చూసేందుకు అమాయకంగా కనిపిస్తుంది కంత్రీ. భర్తను చంపి కట్టుకథ అల్లి పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు పాడు పరిధి గుండ్లరేవుకి చెందిన భూక్యా మహేష్‌కు, అదే జిల్లా పాల్వంచ మండలం కరకవాగుకు చెందిన లతతో వివాహం జరిగింది. వీరికి బాబు, పాప ఉన్నారు. మహేష్ క్యాబ్ డ్రైవర్. ఈ క్రమంలో అతడికి రెండు సార్లు పక్షవాతం వచ్చింది. ప్రస్తుతం ఈ కుటుంబం కేపీహెచ్‌బీలో నివాసం ఉంటుంది. అయితే మహేష్‌కు విక్రమ్ అనే మరో క్యాబ్ డ్రైవర్‌తో స్నేహం ఏర్పడింది. దీంతో అతడికి రెండు సార్లు ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది.
తమ ఆనందానికి అడ్డుగా ఉన్న మహేష్‌ను చంపేయాలని అనుకున్నారు భార్య లత, అతని స్నేహితుడు మహేష్. ఈ ఏడాది జూన్ 22న మహేష్‌ను కుర్చీలో కూర్చొబెట్టి ఉరివేశారు. తన భర్త మూర్చతో మృతి చెందినట్లు అందరిని నమ్మించింది లత. అలా చెప్పడంతో అడ్డంగా బుక్కయ్యింది. ఇంటి యజమాని దగ్గరలోని వైద్యుడ్ని పిలువగా.. అప్పటికింకా మహేష్ నాడి కొట్టుకుంటూ ఉండటంతో వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు మరణించాడు మహేష్. శవ పరీక్షలో సహజ మరణం కాదని, మెడకు ఉరేసి చంపినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు లతను అదుపులోకి తీసుకుని తమ దైన స్టైల్లో విచారించగా.. ప్రియుడితో కలిసి చంపేసినట్లు పేర్కొంది. విక్రమ్ పరారీలో ఉండగా.. పోలీసులు గాలిస్తున్నారు.