iDreamPost
android-app
ios-app

Crime News తిన‌డానికి డ‌బ్బులు అడిగాడ‌ని ఆరేళ్ల బాలుడిని గొంతుపిసికి చంపిన హెడ్ కానిస్టేబుల్

  • Published May 12, 2022 | 12:53 PM Updated Updated May 12, 2022 | 12:53 PM
  • Published May 12, 2022 | 12:53 PMUpdated May 12, 2022 | 12:53 PM
Crime News తిన‌డానికి  డ‌బ్బులు అడిగాడ‌ని ఆరేళ్ల బాలుడిని గొంతుపిసికి చంపిన హెడ్ కానిస్టేబుల్

ప్రజలను రక్షించాల్సిన పోలీస్, మయాంక్(6) అనే బాలుడి పాలిట మృత్యువయ్యాడు. తినడానికి డబ్బులు అడిగి, విసిగిస్తున్నాడ‌ని బాలుడిని గొంతుపిసికి చంపాడో హెడ్ కానిస్టేబుల్. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని దతియా జిల్లాలో, మే5న ఈ దారుణం జరగ్గా, మే11, బుధవారం హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్ తో విషయం వెలుగుచూసింది. గ్వాలియర్ పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో రవిశర్మ, హెడ్ కానిస్టేబుల్. మే5వ తేదీన ఓ

బాలుడు రవిశర్మను తినడానికి డబ్బులు అడిగాడు. డబ్బులు లేవని ఎంత చెప్పినా వినకుండా.. పదే పదే అడగడంతో విసిగిపోయిన రవిశర్మ, బాలుడి గొంతు నులిమాడు. అత‌ను చ‌నిపోయేస‌రికి, విషయం బయటికి తెలియకుండా.. బాలుడి మృతదేహాన్ని పోలీస్ వాహనంలో తీసుకెళ్లి, దతియా పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో గ్వాలియర్ – ఝాన్సీ రోడ్డులోని, నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు. స్థానికులు బాలుడి మృతదేహం గురించి పోలీసులకు సమాచారమివ్వగా.. కేసు నమోదు చేసి విచారణ చేశారు. అక్కడున్న సీసీటీవీలు నిందితుడ్ని పట్టించాయి. పోలీసులు రవిశర్మను అరెస్ట్ చేశారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss