iDreamPost
iDreamPost
క్రమంగా దేశంలో వెబ్ సిరీస్ లకు దక్కుతున్న ఆదరణ చూశాక చిన్నా పెద్ద తేడా లేకుండా ఆర్టిస్టులందరూ వీటిని ఓసారైనా ట్రై చేయాలని డిసైడ్ అయిపోయారు. సినిమాలకు ధీటుగా బడ్జెట్లు రెమ్యునరేషన్లు ఉండటం ప్రధాన కారణం కాగా హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా కోట్లాది ప్రేక్షకులకు త్వరగా రీచ్ అయ్యే సాధనంగా ఓటిటిలు మారిపోవడంతో స్టార్లు సైతం వీటి పట్ల తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. అందులో భాగంగా మల్టీ స్టారర్లు రూపొందనున్నాయి. కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు పెట్టేందుకు డిజిటల్ కంపెనీలు సిద్ధపడుతుండగా దానికి తగ్గట్టే కథలను రెడీ చేస్తున్నారు రచయితలు దర్శకులు.
విషయానికి వస్తే మలయాళంలో ఓ భారీ వెబ్ సిరీస్ కు ప్లానింగ్ జరుగుతోంది. కాంబినేషన్ మాములుగా లేదు. మోహన్ లాల్ – మమ్ముట్టి – ఫహద్ ఫాసిల్ – కమల్ హాసన్ ల అరుదైన కలయికలో నెట్ ఫ్లిక్స్ ఒక భారీ ప్రాజెక్టుని సెట్ చేస్తున్నట్టుగా సమాచారం. అసలు పేర్లు చదవగానే మూవీ లవర్స్ కి గూస్ బంప్స్ వచ్చే కలయిక ఇది. వీళ్ళే కాకుండా అసిఫ్ అలీ, శాంతి కృష్ణ లాంటి ఇతర తారాగణం కూడా ఉంటుంది. ప్రముఖ కేరళ రచయిత వాసుదేవన్ నాయర్ రాసిన చిన్ని కథల ఆధారంగా ఈ యాంతాలజీ రూపొందిస్తారట. వీటికి దర్శకులుగా ప్రియదర్శన్, లిజో జొస్, జయరాజ్, సంతోష్ శివన్ లాంటి లెజెండరీ పేర్లు లిస్టులో ఉన్నాయట.
కాకపోతే కమల్ హాసన్ ఇందులో నటన పరంగా భాగం కాకపోవచ్చని అంటున్నారు. కేవలం సిరీస్ కు సమర్పకుడిగానే ఉంటారని మల్లువుడ్ టాక్. ఆల్రెడీ రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైపోయిందని అంటున్నారు. ఇదేదో బాగానే ఉంది కాబట్టి తెలుగులోనూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఇక్కడా ఆ ట్రెండ్ చూడొచ్చు. ఆ మధ్య పిట్టకథలు అంటూ ఏదో ట్రై చేశారు కానీ మరీ పిచ్చి కథలు ఉండటంతో జనం తిరస్కరించారు. అలా కాకుండా మంచి కంటెంట్ తో కనక స్టార్స్ ని ప్రెజెంట్ చేస్తే బ్రేక్ ఇవ్వడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇలాంటి కాంబినేషన్లకు వచ్చే క్రేజ్ వేరు కాబట్టి ఇక్కడ క్వాలిటీ ముఖ్యం
Also Read : Kinnerasani : విడుదలకు సిద్ధం అయినా చుట్టూ పద్మవ్యూహం