iDreamPost
android-app
ios-app

పోలీసు వాహనంపై యువతి వెర్రి చేష్టలు.. అధికారి సస్పెండ్

పోలీసు వాహనంపై యువతి వెర్రి చేష్టలు..  అధికారి సస్పెండ్

ఇటీవల కాలంలో ఫేమస్ అయ్యేందుకు ఆయుధంగా మారింది సోషల్ మీడియా. ముఖ్యంగా యువతకు అదొక వరంగా మారింది. పేరుతో పాటు డబ్బు కూడా వస్తుండటంతో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌పై దృష్టి సారిస్తున్నారు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, జోష్, స్నాప్ చాట్ వంటి మాధ్యమాల్లో తమ వీడియోలను పెడుతూ ఫాలోవర్లును పెంచుకుంటున్నారు. కంటెంట్‌తో సంబంధం లేకుండా ఎటువంటి వీడియోలు, రీల్స్ చేసినా చేసినా అవి రివ్వున దూసుకెళుతుండటంతో.. పిచ్చి పిచ్చి వీడియోలు కూడా అప్ లోడ్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఏం చేసినా పక్కన వారికి ఇబ్బంది కలిగించనంత వరకు ఓకే గానీ.. కలిగిస్తే.. ఇదిగో ఇలా జరుగుతుంది. ఓ అమ్మాయి చేసిన వెర్రి పని వల్ల ఓ పోలీసు అధికారి ఉద్యోగం ఊడింది.

ఇంతకు ఏం జరిగిందంటే.. ఓ అమ్మాయి తన ఇన్ స్టా రీల్ కోసం..ఓ పోలీసు వ్యానును వినియోగించింది. దీంతో పోలీసాఫీసర్ జాబ్ ఊస్టింగ్ అయ్యింది. ఆ అమ్మాయి కూర్చుంటే.. ఇతని ఉద్యోగం ఎందుకు తీసేస్తారన్న డౌట్ వచ్చిందా..? యువతి పోలీసు వ్యాను మీద కేవలం కూర్చొడమే కాదూ.. మిడిల్ ఫింగర్ రేజ్ చేస్తూ.. వీడియోను షూట్ చేసింది. అలా వీడియో తీసుకునేందుకు ఆ పోలీసు అధికారి అడ్డుచెప్పకపోగా.. అనుమతినివ్వడం.. ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో యువతిని పోలీసు వాహనంపై కూర్చుని రీల్ చేసుకునేందుకు అనుమతిచ్చాడని తెలియడంతో పోలీసు అధికారిని  ఉద్యోగం నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈ ఘటన పంజాబ్ జలంధర్ నగరంలో చోటుచేసుకుంది. రాత్రి సమయంలో పోలీసు కారు బానెట్ పై కూర్చున్న యువతి తన వేళ్లతో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ రీల్స్ రూపొందించింది. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై జలంధర్ పోలీసులు సీరియస్ అయ్యారు. ఆమె పోలీసు వాహనంపై రీల్స్ చేసుకునేందుకు అనుమతినిచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశోక్ శర్మను కమీషనర్ కుల్ దీప్ సస్పెండ్ చేశారు. అదే విధంగా ఆ యువతిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.