iDreamPost
android-app
ios-app

కార్మికుల సోమ్ము దోచినవారికి మద్దతుగా సీపిఐ

  • Published Jun 13, 2020 | 7:38 AM Updated Updated Jun 13, 2020 | 7:38 AM
కార్మికుల సోమ్ము దోచినవారికి మద్దతుగా సీపిఐ

కమ్యూనిస్టు సిద్దాంతంలో అతి ముఖ్యమైనది దోపిడీ దారులకు వ్యతిరేకంగా బడుగు వర్గానికి అండగా ఉంటూ వారి ఆస్తులు దోపిడికి గురి కాకుండా వారి పక్షాన నిలబడి పోరాటం చేయడం. ఇలా దోపిడికి వ్యతిరేకంగా మొదలైన కమ్యూనిస్టు సిద్దాంతం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గాడి తప్పి దోపిడిదారుల వ్యవస్థకే మద్దతుపలుకుతూ వారి పక్షాన నిలబడి పోరాడటం ఈ మధ్య కనిపిస్తూ ఉంది. కమ్యూనిస్టుల సైద్దాంతిక నినాదం పక్కదారిపట్టడం వెనక కారణం ఎంటి? ఎవరి ప్రేరణతో ఈ భిన్నమైన విధానాన్ని కామ్రేడ్స్ మోస్తున్నారు?

2014 ఎన్నికల్లో గెలిచి, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలుగుదేశం పార్టీ పెద్దలు చెసిన అనేక అక్రమాల్లో కార్మికుల సోమ్ముని కొల్లగొట్టిన ఈ.ఏస్.ఐ స్కాం ఒకటి. ఈ స్కాం తాజాగా బయటపడటం దానికి సూత్రదారిగా వ్యవహరించారనే ఆరోపణలతో అనాటి మంత్రి అచ్చం నాయుడి ని అరెస్టు చేయడం వంటి కార్యక్రమాలు చక చకా జరిగిపోయాయి. అయితే దోపిడీకి సంభందించిన ఈ అరెస్టులని సాటి కమ్మ్యునిస్టు పార్టీ సీపీఎం సమర్ధించగా , సీపిఐ మాత్రం కమ్మ్యునిస్టు మూల సిద్దాంతం అయిన కార్మికశక్తికి అండగా నిలబడకపోగా కార్మికుల చమటోడ్చి సంపాదించిన సొమ్ముని దోచుకున్నవారి అరెస్టు అక్రమం అంటు తమ గళాన్ని వినిపించడం అందరిని ఆశ్చర్యపడేలా చేసింది.

సీపిఐ నేత రామకృష్ణ మాట్లడుతూ , అసెంబ్లీ సమావేశాల ముందు ఈ అరెస్టు సరికాదని నిజంగా సాక్ష్యాదారాలు ఉన్న అసెంబ్లీ సమవేశాల తరువాత విచారణ జరిపి ఉండొచ్చు అని భాద్యతా రహితమైన కామెంట్స్ చేశారు. అక్రమాలు చోటు చేసుకున్న చోట తిధులు ముహూర్తాలు చూసి అధికారులు స్పందిoచాలని కమ్మ్యునిస్టు గా పిలవబడేవారే చెప్పడం కార్మికులకు వెన్నుపోటు పొడిచినట్టు కాదా ? ఇక ఆ పార్టీ నేత నారాయణ సైతం ఇదేవిదంగా స్పందించారు. ఇలా కార్మికుల డబ్బును ప్రభుత్వంలో అధికారం అనుభవిస్తూ బొక్కేసిన వారికి ఈ నయా కమ్మ్యునిస్టు వాదులు వత్తాసు పలకడం చూస్తే సిపిఐ పార్టీ రాష్ట్రంలో చంద్రబాబుకు బీ టీంగా పనిచేస్తుందా అనే అనుమానం రాక మానదు.