అసెంబ్లీ ప్రారంభంలోనే జగన్‌ ఏం చేశారంటే..

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో మండలి రద్దు తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. బీఏసీ సమావేశం తర్వాత తిరిగి ప్రారంభమైన సభలో స్పీకర్‌ వినతి మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏపీ శాసన మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం చర్చ ప్రారంభమైంది.

ఈ తీర్మానంపై చర్చలో మొదటగా పశ్చిమ గోదావరి జిల్లా నేత, రాష్ట్ర వైద్యశాఖామంత్రి ఆళ్ల నాని మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం, అనంతరం రాజధాని ఏర్పాటు, రాష్ట్రంలో యువకులకు ఉన్న ఉద్యోగ అవకాశాలపై నాని మాట్లాడారు. ప్రజాభీష్టం మేరకు ఏర్పాటు చేస్తున్న మూడు రాజధానులపై టీడీపీ వ్యవహరించిన తీరును ఎండగట్టారు.

Read Also: మండలి రద్దుకు కేబినెట్‌ ఆమోదం

చర్చ అనంతరం మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అనంతరం ఈ తీర్మానాన్ని పార్లమెంట్‌కు పంపనున్నారు. పార్లమెంట్‌ ఎగువ, దిగువ సభల్లో చర్చ, ఆమోదం అనంతరం రాష్ట్ర పతికి వద్దకు మండలి రద్దు వ్యవహారం వెళ్లనుంది. చివరగా రాష్ట్ర పతి ఆమోద ముద్రవేసి గెజిట్‌ వెలువరిస్తే మండలి రద్దు ప్రక్రియ ముగియనుంది.

Show comments