iDreamPost
android-app
ios-app

బెంగళూరుతో పోలిస్తే HYDలో ఖర్చు తక్కువ! టెకీ పోస్ట్ వైరల్!

బెంగళూరుతో పోలిస్తే HYDలో ఖర్చు తక్కువ! టెకీ పోస్ట్ వైరల్!

ప్రస్తుతం పల్లెటూళ్లు నగరాలుగా మారుతున్నాయి. నగరాలు పట్టణాలుగా, పట్టణాలు మహా నగరాలు అటు నుండి మెట్రో పాలిటన్ ప్రాంతాలుగా రూపాంతరం చెందుతున్నాయి. అయితే పల్లెటూళ్లలో గంజి మెతుకులు తిన్నా బతికేయొచ్చు కానీ అదే నగరంలో అలాంటివి చెల్లవు. ఇక్కడ ప్రతిదీ ఖర్చుతో కూడుకున్నదే. ఇక హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, ఢిల్లీ వంటి మెట్రో పాలిటన్ ప్రాంతాల్లో జీవించాలంటే జేబులకు చిల్లు పడాల్సిందే. ఇక ఇంటి అద్దె దగ్గర నుండి నెలకు సరిపడా అవసరాలు, ఇతర ఖర్చులు వెరసి తడిసి మోపుడు అవుతుంటాయి. ఇక సామాన్యుడు ఈ ప్రాంతాల్లో బతకాలంటే చాలా కష్టం. కానీ ఉద్యోగాలు ఈ నగరాల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి.. చాలా మంది తప్పని సరి పరిస్థితుల్లో ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరిని ఆలోచింప చేస్తుంది. దానికి కారణం లేకపోలేదు.. ఎందుకంటే.. బెంగళూరులో ఖర్చులు ఎక్కువంటూ..  అదే హైదరాబాద్ వచ్చాక చాలా డబ్బులు ఆదా అయ్యాయంటూ పేర్కొనడమే.

దక్షిణాది రాష్ట్రాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా చూసే ప్రాంతాలు హైదరాబాద్, బెంగళూరు. వాస్తవానికి హైదరాబాద్‌తో పోల్చుకుంటే బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు బెంగళూరును తలదన్నేలా హైదరాబాద్ మహా నగరం దూసుకుపోతుంది. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడం, కంపెనీలు ఏర్పడటం, ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఈ నగరానికి రావడంతో విస్తరణ చెందుతోంది. అయితే ఇప్పుడు పృథ్వీ రెడ్డి అనే ఓ టెకీ బెంగళూరులో పరిస్థితులను అద్దంపుడుతూ ఓ ట్వీట్ చేశాడు అదేంటంటే.. తాను బెంగళూరు నుండి హైదరాబాద్ వచ్చాక తనకు రూ. 40 వేలు మిగిలాయంటూ పేర్కొన్నాడు. ఆ డబ్బులతో ఓ కుటుంబం ఎంతో హాయిగా బతికేయోచ్చు అంటూ రాసుకొచ్చాడు. దీనిపై భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఏంటీ ఇంత సేవ్ చేస్తారా..? ఎలాగో చెప్పచ్చుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు. రూ. 40 వేలు అద్దె మీదే సేవ్ చేస్తున్నావా అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘అద్దె,మెయింటెనెన్స్, వాటర్, ఎలక్ట్రిసిటీ బిల్, ఫుడ్’అని చెప్పుకొచ్చాడు.

కాగా, బెంగళూరులో నివసిస్తున్న నెటిజన్లు అతడికి మద్దతుగా నిలిచారు. ఇక్కడ ఖర్చులు ఇలానే ఉంటాయని పేర్కొంటున్నారు. అలాగే హైదారాబాద్‌లో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు తాను ఎలాంటి సూత్రాలు పాటిస్తున్నానో కూడా వెల్లడించాడు. అలాగే ఓ నెటిజన్ వేసిన ప్రశ్నలు స్పందించాడు. మెట్రో స్టేషన్ కు దగ్గర్లో అద్దె వెతుక్కోవాలని తెలిపాడు. రద్దీ వేళల్లో ఆటోలు ఎలాంటి చార్జీలు వసూలు చేస్తున్నాయో గమనించాలని తెలిపారు. ఉదయం 8-9 గంటల మధ్యలో సాయంత్రం 6-7 గంటల సమయాల్లో ఆర్టీసీ బస్ ప్రయాణం ఎంచుకోవాలని సూచించారు. రూ. 250 కన్నా తక్కువ ధరకే లభించే మంచి ఆహారాన్ని ఆర్డర్ చేసేందుకు ప్రయత్నించడని తెలిపారు. హైదరాబాద్‌లో బ్రోకర్ల కోసం రెండు నెలలు అదనపు ఇంటి అద్దె చెల్లించడం, పెయింటింగ్ చార్జీలు, లక్ష డిపాజిట్ చెల్లించడం చూశారా.. ? లేదు కదా..? ఇక్కడ చౌకగా ఇల్లు అద్దెకు దొరికే ప్రాంతాలు తనకు తెలుసునని, తానేమీ దోమలు, ఎలుకలు, విద్యుత్, నీటి సమస్యలతో సతమతమౌతున్న ప్రాంతంలో నివసించడం లేదంటూ పేర్కొన్నాడు.