ఏపీలో నాలుగు లక్షలు దాటిన కరోనా టెస్టులు

నియంత్రణలో దేశంలోనే రికార్డ్

కరోనా నియంత్రణ, పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరుదైన ఘనత సాధించింది. నాలుగు లక్షలకు పైగా కొవిడ్-19 పరీక్షలు నిర్వహించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జూన్ 4 2020 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ పరీక్షలు 4,13,773 లక్షలు కి చేరాయి.

ఇందులో 4112 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 3377 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 616 మంది , విదేశాల నుంచి తిరిగి వచ్చిన 119 మంది ఉన్నారు.

మే 1, 2020 నాటికి రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ పరీక్షల సంఖ్య లక్ష దాటింది. సరిగ్గా నెల రోజుల్లో ఆ సంఖ్య ఏకంగా 4లక్షలు దాటింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ పరీక్షల సంఖ్య ను మరింత వేగవంతం చేయడం, పరీక్షల సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచడంతో మొత్తం 4,13,733 కోవిడ్ టెస్ట్ ల మైలు రాయిని చేరింది.

రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన కఠినమైన విధానాలతో పాటు ఎప్పటికప్పుడు కొవిడ్-19 పరీక్షలని పెంచుతూ ఎక్కడా ఉదాసీనంగా వ్యవహరించ కుండా.. అందరి కంటే కాస్త ముందు జాగ్రత్తతో అప్రమత్తంగా ఉంటోంది.

ఒక మిలియన్ జనాభాకు ఆంధ్రప్రదేశ్ లో 7748 టెస్ట్ లు జరుగుతుండగా… భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ ఫస్ట్ ప్లేసులో నిలిచింది. ఆ తరువాత 6864 టెస్టులతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. చేసిన పరీక్షలు, వచ్చిన కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్యలను పరిశీలిస్తే.. ఒక శాతం కూడా నమోదు లేదు. అదే సమయంలో అత్యధికంగా డిశ్చార్జ్ రేటు ఉంటోంది. దీనివల్లే కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడంలో ప్రపంచ మరియు జాతీయ సగటుతో పోల్చినపుడు మన రాష్ట్రం మెరుగైన స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు లక్షణాలు ఉన్నా… లేకపోయినా అందరికీ టెస్టులు నిర్వహిస్తున్నామని, దీని వల్ల కరోనాను సరిగ్గా అంచనా వేసి తగిన చర్యలు చేపట్టడం సాధ్యం అవుతుందని ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జ శ్రీకాంత్ తెలిపారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నామని, ప్రజలు కూడా స్వీయ రక్షణ పాటించి కరోనా బారిన పడకుండా ఉండాలని సూచించారు. 8వ తేదీ నుంచి మాల్స్, ఆలయాలు, హోటళ్ళు తది తర ప్రధాన కార్యకలాపాలు కూడా ప్రారంభం అవుతున్నండున దున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

Show comments