iDreamPost
iDreamPost
కరోనా తీవ్రరూపం దాలుస్తున్న వేళ అనవసర ఆందోళన సర్వత్రా వ్యాపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు కంగారు పుట్టిస్తున్నాయి. చివరకు పరీక్షల ఫలితాలు రాకముందే కొందరు అనూహ్యంగా తనువు చాలించేటంత కలవరం కనిపిస్తోంది. అయితే వాస్తవ లెక్కలు భిన్నంగా ఉన్నాయి. కరోనా కారణంగా కోలుకుంటున్న వారి సంఖ్య చాలా పెరుగుతోంది. ముఖ్యంగా ఏపీలో మందులు, బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ వంటి సరఫరాపై పెట్టిన శ్రద్ధ కొంత సత్ఫలితాన్నిస్తోంది. దేశంలోనే రికవరీ రేటులో మొదటి స్థానంలో నిలిచేందుకు దోహదపడుతోంది. జాతీయ సగటుకన్నా చాలా ఎక్కువగా ఏపీలో కరోనా బాధితులు ఆరోగ్యంతో కోలుకునే అవకాశం దక్కుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రికవరీ రేటు 84గా ఉంది. దేశమంతా ఇది క్రమంగా పడిపోతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఫరిస్థితి దీన్ని దిగజారుస్తోంది. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో రికవరీ రేటు తగ్గుముఖం పట్టింది. కానీ ఏపీలో మాత్రం రికవరీ రేటు 92.53 శాతంగా ఉంది. అంటే దాదాపుగా నూటికి 93 మంది తిరిగి ఆరోగ్యవంతులవుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రభుత్వం సమర్థతను ఈ లెక్కలు చాటుతున్నాయి.
దేశం యావత్తు కోరనా సెకండ్ వేవ్ మహమ్మారి తో పోరాడుతున్న సమయంలో అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో సదుపాయాలు మెరుగ్గా ఉండడమే దానికి మొదటి కారణమని వైద్య నిపుణుల అభిప్రాయం. దానికి అనుగుణంగానే మిగితా రాష్ట్రాలలో పోల్చితే ఏపీ ప్రబుత్వం ముందు చూపుతో ఏర్పాటు చేసిన వైరల్ లాబ్స్ కోవిడ్ ఆసుపత్రులు కొత్తగా తీసుకున్న డాక్టర్ లు ఎంతో ఉపయోగపడుతున్నటటు చెబుతున్నారు. యంత్రాంగం, సామాగ్రి సిద్ధం చేసినా కొన్ని చోట్ల అవస్థలు తప్పడం లేదు. కేంద్రం నుంచి తగిన సహకారం కనిపించం లేదు. అవసరమైన స్థాయిలో వ్యాక్సిన్లు, రెమిడిసిమిర్, ఆక్సిజన్ సరఫరాలో జరుగుతున్న లోపం కొంత సమస్యగా మారుతోంది.
అయితే ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ , కర్ణాటక , ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పరిస్థితి దాదాపుగా చేయిదాటిపోయందనే రీతిలో కనిపిస్తోంది. పాజిటివిటీ రేటు 50 శాతం పైబడి ఉందంటే బెంగాల్ ఎలాంటి తీవ్రతను ఎదుర్కుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆస్పత్రుల్లో ప్రవేశాలకు బెడ్స్ లేవని ఢిల్లీలో బోర్డులు దర్శనమిస్తున్నాయి. యూపీలో శ్మశానాల వద్ద దహన క్రియలకు రెండు రోజులు పడుతోంది. ఇలాంటి అనేక గడ్డు పరిస్థితుల్లో దేశం విలవిల్లాడుతున్న తరుణంలో ప్రపంచమంతా భారతదేశం పట్ల దీనంగా చూస్తోంది. మోడీ నిర్వాహక ఫలితమేనని మండిపడుతోంది.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏపీలో కొంత ఆశాజనక వాతావరణం కొనసాగుతుండడం ఉపశమంగానే చెప్పవచ్చు. హైదరాబాద్ లాంటి మహానగరాలు ఉన్న తెలంగాణాలో కూడా వైద్య సదుపాయాల కోసం జనం అవస్థలు పడుతుంటే ఉన్న వనరుల వినియోగంలో ఏపీ ప్రభుత్వం చేసిన కృషి కొంత సత్ఫలితాన్నిస్తోంది. అందుకు అధికారులు, ప్రభుత్వ పెద్దలు సమన్వయం తో చేసిన ప్రయత్నాలు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
Also Read : మహమ్మారికి మూకుతాడు.. సీఎం జగన్ మరో కీలక నిర్ణయం