కరోన కాటు… ఏపీలో పెరుగుతున్న కేసులు

కరోన వైరస్‌ మహమ్మరి వేగంగా వ్యాపిస్తోంది. ఒక్కసారిగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం వరకూ 13 కేసులున్న ఏపీలో ప్రస్తుతం ఆ సంఖ్య 180కి చేరుతోంది. నిన్న రాత్రి 10 గంటల వరకూ 164 కేసులు నమోదు కాగా, ఈ రోజు ఉదయం 10 గంటలకు అదనంగా మరో 16 కేసులు నమోదయ్యాయి. 12 గంటల్లో 16 కొత్త కేసులు నమోదవడం కరోన మహమ్మరి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

మరో తెలుగు రాష్ట్రం తెలంగాణాలో నిన్నటికి పాజిటివ్‌ కేసుల సంఖ్య 229కి చేరింది. ఒక్కొ రోజు 74 కొత్త కేసులు నమోదవడం గమన్హారం. కరోనా మహమ్మరి ఏపీలో ఒకరిని బలితీసుకోవాగా తెలంగాణాలో 11 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ నెల ఏడు నాటికి తెలంగాణలో కరోనా నియంత్రణలోకి వస్తుందని సీఎం కేసీఆర్‌ అంచనా తాజాగా పరిణామాల నేపథ్యంలో తప్పేలా ఉంది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన జమాత్‌కు వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నెల 14వ తేదీన ముగిసే లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ సాగుతోంది. దశల వారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ మొన్న సీఎంలతో జరిగిన సమీక్షా సమావేశంలో వెల్లడించారు. నిన్నటికి దేశంలో 2,567 మందికి కరోనా సోకింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఎత్తి వేత ఎలా జరుగుతుంది..? ఆంక్షలు ఎలాఉండబోతున్నయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. గత నెల 25వ తేదీ నుంచి దేశంలో లాక్‌డౌన్‌ అమలవుతోంది. అంతకు ముందు 22వ తేదీన జనతా కర్ఫ్యూ, మరుసటి రోజు నుంచే తెలుగు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించాయి.

Show comments