iDreamPost
android-app
ios-app

ఆందోళన వ‌ద్దు.. స‌మ‌స్య‌లు అధిగ‌మిద్దాం.. ఏపీ సీఎం జ‌గ‌న్

  • Published Apr 01, 2020 | 1:31 PM Updated Updated Apr 01, 2020 | 1:31 PM
ఆందోళన వ‌ద్దు.. స‌మ‌స్య‌లు అధిగ‌మిద్దాం..  ఏపీ సీఎం జ‌గ‌న్

క‌రోనా కార‌ణంగా ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వద్ద‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. క‌రోనా పెద్ద ప్ర‌మాద‌క‌రం కాద‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా జాగ్ర‌త్త‌లు పాటిస్తే ఇబ్బంది లేకుండా భ‌య‌ప‌డ‌తామ‌ని భ‌రోసా క‌ల్పించారు. 85 శాతం మందికి ఇంట్లోనే ఈ వ్యాధి న‌యం అవుతుంద‌ని వివ‌రించారు. ఇంట్లోనే ఉండి జాగ్ర‌త్త‌లు పాటిస్తే చాలని చెప్పారు. 14 శాతం ఆస్ప‌త్రికి వెళితే అందులో కొద్ది శాతం మందికే ఐసీయూ అవ‌స‌రం అవుతుంద‌ని తెలిపారు.

రాష్ట్రంలో ఇంటింటికీ వాలంటీర్లు, ఏఎన్ఎంలు ప‌ర్య‌వేక్ష‌ణ‌కు వెళుతున్నార‌ని చెప్పారు. ఢిల్లీలో మ‌త కార్య‌క్ర‌మాల‌కు వెళ్లిన వారిలో ఇప్ప‌టికే 585 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని , మిగిలిన వారికి కూడా ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే 87 కేసుల‌కు పెర‌గ‌డానికి ఢిల్లీ యాత్ర కార‌ణంగా మారింద‌ని అన్నారు. త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నామ‌ని వివ‌రించారు. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉంటే వెంట‌నే వైద్య బృందాల‌ను సంప్ర‌దించి, ప‌రీక్ష‌లు చేయించుకుంటూ, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు.అ ది వారి కుటుంబ స‌భ్యుల‌కు, స‌మాజానికి చాలామందని హిత‌బోధ చేశారు.

ప్రైవేటు ఆస్ప‌త్రులు, ప్రైవేటు వైద్య క‌ళాశాల‌ల యాజ‌మాన్యాలు కూడా క‌రోనా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగ‌స్వాములు కావాల‌ని కోరారు. ఇప్ప‌టికే వాలంటీర్లుగా ముందుకొచ్చిన వారి జాబితా సిద్ధం చేస్తున్నామ‌ని తెలిపారు. అంద‌రూ ముందుకురావాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను ప్ర‌భుత్వం గ‌మ‌నంలో ఉంచుకుని, వారికి త‌గిన తోడ్పాటు అందిస్తామ‌ని అన్నారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితుల‌పై ఇప్ప‌టికే అనుకోని భారం ప‌డింద‌న్నారు. అయినా భారాన్ని గ‌మ‌నించి వేత‌నాల వాయిదాకి ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించిన అన్ని వ‌ర్గాల ఉద్యోగులు, పెన్స‌నర్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. క‌ష్ట‌మ‌యినా స‌రే వాయిదా వేసేందుకు ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించార‌ని తెలిపారు.

గ్రామాల‌లో వ్య‌వ‌సాయం చేస్తున్న రైత‌న్న‌లు, రైతు కూలీల‌కు కూడా ఎవ‌రి ప‌నులు వాళ్లు చేసుకోవ‌డానికి మ‌ధ్యాహ్నం 1గం. వ‌ర‌కూ స‌మ‌యం ఇచ్చామ‌న్నారు. ఆ స‌మ‌యంలో ఎవ‌రు ఏ ప‌నిచేసుకున్నా అభ్యంత‌రం లేద‌న్నారు. ప‌నుల స‌మ‌యంలో తిన జాగ్ర‌త్త‌లు, భౌతిక దూరం పాటించ‌డం కీల‌కంగా ఉండాల‌ని సూచించారు. ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు. రైస్, దాల్ మిల్లులు కూడా య‌ధావిధిగా ప‌నిచేసుకోవ‌చ్చ‌ని, జాగ్ర‌త్త‌లు పాటిస్తూ ముందుకు సాగాల‌ని తెలిపారు. జ్వ‌రం లాంటి క‌రోనా గురించి భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని, పూర్తిగా న‌యం అయిపోయే అవ‌కాశం ఉంద‌న్నారు. క‌రోనా వ‌చ్చిన వారి ప‌ట్ల ద్వేష‌భావం త‌గ‌ద‌ని సూచించారు. వివ‌క్ష చూప‌కుండా మ‌రింత మాన‌వ‌త్వం చూపాల‌ని కోరారు. ప్రేమ‌, ఆప్యాయ‌త‌లు చూపి 104కి ఫోన్ చేసి ఇంట్లోనే ఉండి జాగ్ర‌త్త‌లతో స‌మ‌స్య అధిగ‌మించ‌వ‌చ్చ‌ని తెలిపారు. 14 రోజుల పాటు ఐసోలేష‌న్ లో ఉండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని తెలిపారు.