ఏదైనా కొత్త వైరస్ వ్యాపిస్తుంది అంటే దాని ప్రభావం అధికంగా పడేది పౌల్ట్రీ పరిశ్రమ పైనే.. గతంలో కూడా స్వైన్ ఫ్లూ విజృంభించినప్పుడు పౌల్ట్రీ పరిశ్రమ కుదేలయింది. ప్రస్తుతం కరోనా వైరస్ ధాటికి ఈ పరిశ్రమ భారీ నష్టాలలో నడుస్తుంది.
దేశవ్యాప్తంగా పౌల్ట్రీ పరిశ్రమ కొన్ని వదంతుల కారణంగా గత కొన్ని రోజుల్లోనే 27 వేల కోట్ల నష్టాన్ని చవిచూసింది. గుడ్లు,కోడిమాంసం, తింటే కోవిడ్(కరోనా) బారిన పడతారని సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారం కోడి మాంసం గుడ్లు కొనడానికి వినియోగదారులు ముందుకు రాకపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలయింది. 70% అమ్మకాలు క్షీణించడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది.
తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 1000 కోట్ల మేరా నష్టం వాటిల్లడంతో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. దీంతో తిరిగి పౌల్ట్రీ పరిశ్రమను నిలబెట్టడానికి తెలంగాణ మంత్రులే రంగంలోకి దిగారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ మేళాలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ మేళాలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ చికెన్ గుడ్లు తినడం వల్ల కరోనా వైరస్ రాదని, అతి చౌకగా పోషక విలువలు అందించే ఆహారం కోడి మాంసం, గుడ్లే అని తెలిపారు. తమ కుటుంబం నిత్యం వాటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉన్నామని చెప్పుకొచ్చిన కేటీఆర్ కరోనా వైరస్ చికెన్,గుడ్లు తినడం వల్ల రాదని స్పష్టం చేశారు.ఈ వందంతులను అరికట్టడంలో భాగంగా తెలంగాణ మంత్రులు చికెన్ ఎగ్ మేళా కార్యక్రమంలో చికెన్ తిని అవన్నీ పుకార్లేనని తేల్చి చెప్పారు. ఈ చికెన్ అండ్ ఎగ్ మేళా కార్యక్రమంలో తలసాని శ్రీనివాస యాదవ్,ఈటెల రాజేందర్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న నిరూపణ లేని శాస్త్రీయ ఆధారం లేని ఈ వదంతుల వల్ల ఇప్పటికే చికెన్,గుడ్ల ధరలు తగ్గి పౌల్ట్రీ పరిశ్రమ నష్టాల్లో సాగుతుంది. ఈ వదంతులను నమ్మకుండా ఆరోగ్యంగా ఉండటానికి రోజువారీ ఆహారంలో గుడ్లు, చికెన్ ను తీసుకోవచ్చని
వైద్య నిపుణులు చెబుతున్నారు.