iDreamPost
android-app
ios-app

ఏపీలో 71 మందికి కరోనా నిర్దారణ

ఏపీలో 71 మందికి కరోనా నిర్దారణ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగాతగ్గుతుంది.. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6497 శాంపిల్స్ పరీక్షించగా 71 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1403 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా  321 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 1051 గా నమోదయింది.

గడచిన 24 గంటల్లో 34 మంది కరోనా బారినుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గుంటూరు నుండి 28 మంది అత్యధికంగా డిశ్చార్జ్ కాగా అనంతపురం 3, తూర్పు గోదావరి 2,విశాఖపట్నం నుండి ఒక్కరు చొప్పున డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 48 గంటల్లో కరోనా కారణంగా మరణాలు సంభవించకపోవడం ఊరట కలిగించే విషయం. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 మంది మరణించారు.

అత్యధికంగా కర్నూల్ లో 43 మందికి వైరస్ నిర్దారణ కాగా, కృష్ణాలో 10 మందికి కోవిడ్ 19 నిర్దారణ అయింది. కాగా కోవిడ్ ఆసుపత్రులలో పనిచేయడానికి 1170 మంది డాక్టర్లను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే..

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet