iDreamPost
android-app
ios-app

సెప్టెంబర్ 30లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేకుంటే మీ అకౌంట్లు నిలిచిపోతాయి.!

సెప్టెంబర్ 30లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేకుంటే మీ అకౌంట్లు నిలిచిపోతాయి.!

దేశంలోని పౌరులందరికి  వివిధ రకాల ఖాతాలు ఉంటాయి. బ్యాంకు, ఇతర స్కీమ్ లకు సంబంధించిన అకౌంట్లు ఉంటాయి. అయితే వీటికి సంబంధించి అప్ డేట్లు తరచూ వస్తుంటాయి. అయితే పలు సందర్భాల్లో కొన్ని పత్రాలను అకౌంట్లకు తప్పనిసరిగా అనుసంధానం చేయాలంటూ అప్ డేట్లు వస్తుంటాయి. అలానే ఈ సారి కూడా కొన్ని స్కీమ్ లకు సంబంధించిన అప్ డేట్ లు వచ్చాయి. సెప్టెంబర్ 30లోపు కొన్ని కీలక పత్రాలను సమర్పించకపోతే.. నష్టపోతారు. మరి..ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ప్రస్తుతం మనం సెప్టెంబర్ నెల మధ్యలో ఉన్నాం. మరికొద్ది రోజులతో ఈ నెల ముగియనుంది. అయితే ఈ క్రమంలో నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సిన ఐదు ముఖ్యమైన పనులు ఉన్నాయని గుర్తుంచుకోండి. ఆ పనులు  సకాలంలో పూర్తి చేయకపోతే మీరే ఆర్థికంగా నష్టపోతారు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్,  ఇతర పోస్టాఫీసు సేవింగ్ అకౌంట్స్ వంటి పొదుపు స్కీమ్ ల్లో డబ్బులు పెట్టిన వారు ఈనెల 30లోపు ఆధార్ వివరాలను తప్పక అందించాల్సి ఉంటుంది. ఒక వేళ ఆధార్ పత్రాలను సమర్పించడంలో విఫలమైతే అక్టోబర్ 1 నుంచి సదరు వినియోగదారుల ఖాతాలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయని గుర్తుంచుకోండి. అలానే ఎస్బీఐ అందిస్తున్న వుయ్ కేర్ అనే స్కీమ్ల  సీనియర్ సిటీన్లకు సాధారణ రేటుకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు అంటే 100 బేసిస్ పాయింట్ల వడ్డీని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. అయితే దీనిలో పెట్టుబడి పెట్టేందుకు చివరి తేదీ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుందని గుర్తుంచుకోండి. మరి.. విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే మీరు నష్టపోతారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.