iDreamPost
android-app
ios-app

పెద్దమనసు చాటుకున్న సీఎం జగన్‌

పెద్దమనసు చాటుకున్న సీఎం జగన్‌

తాను పేదల పక్షపాతినని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరోమారు చాటుకున్నారు. ప్రజలకు మంచి చేసే విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌ ముందు ఉంటారని తాజాగా విజయవాడ రాజరాజేశ్వరిపేట వాసుల విషయంలో తీసుకున్న చొరవతో నిరూపితమైంది. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో ఉన్న రైల్వే భూమిని ప్రభుత్వానికి ఇవ్వాలంటూ సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్రం రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌కు లేఖ రాశారు. సదరు స్థలంలో దాదాపు 800 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 30 ఏళ్లుగా ఉంటున్న సదరు కుటుంబాలు తమకు నివాస పట్టా మంజూరు చేయాలని విన్నవించుకుంటున్నాయి.

ఈ క్రమంలో సదరు పేద కుటుంబాల వినతులను పరిగణలోకి తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ రైల్వే శాఖకు నష్టం లేకుండా, అదే సమయంలో పేదలకు మంచి జరిగేలా ఓ ప్రతిపాదన పంపారు. రాజరాజేశ్వరిపేటలోని రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే.. అందుకు సమానమైన భూమిని అజిత్‌సింగ్‌నగర్‌ వద్ద అప్పగిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ తన లేఖలో ప్రతిపాదించారు. దాదాపు 25 ఎకరాల భూమిని కేంద్ర రైల్వే శాఖకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్‌ తన సమ్మతిని తెలియజేశారు. ఇప్పటికే అజిత్‌సింగ్‌నగర్‌లోని భూమిని రైల్వే రెవన్యూ విభాగం అధికారులు పరిశీలించారు. తాజాగా సీఎం వైఎస్‌ జగన్‌ కూడా లేఖ రాయడంతో త్వరలో రాజరాజేశ్వరిపేట వాసుల సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభించబోతోంది.

ఈ సమస్యతోపాటు సీఎం వైఎస్‌ జగన్‌.. రాష్ట్రంలో పెడింగ్‌లో ఉన్న రైల్వే పనుల త్వరితగతిన పూర్తి చేయాలని కూడా ఆ శాఖ మంత్రికి విన్నవించారు. రైల్వే జోన్‌ ఏర్పాటు, పనులు జరుగుతున్న వివిధ రైల్వే ప్రాజెక్టులను ప్రస్తావించారు. నిధులు విడుదల చేయాలని విన్నవించారు. నూతన ప్రాజెక్టులకు రాబోవు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు.