Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ.. ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలపై టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా కుట్రలు,దుష్ప్రచారం చేస్తోంది. వీటిని పట్టించుకోకుండా సీఎం వైఎస్ జగన్ ప్రజలకు మంచి జరుగుతుందనుకున్న నిర్ణయాలను, పథకాలను అమలు చేస్తూనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆ పార్టీ అనుకూల మీడియా వ్యవహరిస్తున్న తీరును సీఎం వైఎస్ జగన్ ప్రజల ముందు ఎండగడుతున్నారు. వారు ఎలా వ్యవహరిస్తోంది ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ పైచేయి సాధిస్తున్నారు.
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఓటీఎస్ పథకం ప్రారంభం సందర్భంగా మాట్లాడిన వైఎస్ జగన్.. మరోసారి చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియా సంస్థలు చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాన్ని సరికొత్తగా ప్రజల ముందు ఆవిష్కరించారు. ప్రజల చేతనే వారిని ప్రశ్నించేలా చేశారు.
ఓటీఎస్ ద్వారా పేదలకు మంచి చేస్తున్నామంటే చంద్రబాబు, ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5లు జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో..రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని అధికారులు ఐదుసార్లు ప్రతిపాదనలు పంపితే.. కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదని గుర్తు చేశారు. అలాంటి వీరు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక వేళ వారు మీ వద్దకు వస్తే.. కొన్ని ప్రశ్నలు అడగాలంటూ.. సభకు హాజరైన వారిని సీఎం వైఎస్ జగన్ కోరారు.
ఇవీ ఆ ప్రశ్నలు..
1. మీకు ఉన్నవి, మీరు కొన్నవి రేట్లు పెరిగే రిజిస్ట్రర్ భూములు అయినప్పుడు, మా ఇళ్లకు రేట్లు పెరిగేలా నామమాత్రపు రుసుముతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని మా అన్న అంటే.. మీకు ఎందుకు కడుపు మంట..?
2. మా ఇళ్లను ఓటీఎస్ లేకుండా మార్కెట్ రేటుకు కొంటారా..? ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా మా ఇంటిని మార్కెట్ రేటుకు కొంటారా..?
3. మీ ఆస్తిని మీ వారసులకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు కదా..? మా ఇంటిని మా వారసులకు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేలా మా (జగన్) అన్న చేస్తుంటే మీకు ఎందుకు కడుపు మంట..?
4. 2014–19 మధ్య 43 వేల మంది లబ్ధిదారులు అసలు, వడ్డీ 15.29 కోట్ల రూపాయలు కడితే, ఎలాంటి యాజమాన్యపు హక్కులు ఇచ్చారు..?
5. 30 నెలల కాలంలో 1.16 లక్షల కోట్ల రూపాయలు పార్టీలకు అతీతంగా, లంచాలకు తావు లేకుండా, నేతలతో సంబంధం లేకుండా మా ఖాతాల్లో జమ చేశారు. ఇంత మంచి పని చేసిన జగనన్న .. మా వద్ద నుంచి డబ్బులు లాక్కుంటాడా..?
6. పేదలంటే ఎందుకు అంత కడుపు మంట..? మీ పిల్లలేమో ఇంగ్లీష్ భాషలో ఇంగ్లీష్ స్కూళ్లలో చదవాలి. మా పిల్లలు తెలుగు భాషలో చదవాలా..?
7. మా జగనన్న 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే.. మీరు కోర్టులకు వెళ్లి అడ్డుకోవడం సమంజసమేనా..?
Also Read : ఓటీఎస్‌ను ప్రారంభించిన సీఎం.. జరిగే మేలును పూసగుచ్చినట్లు వివరించిన జగన్