iDreamPost
android-app
ios-app

బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులు, చంద్రబాబుకు ఇదే చివ‌రి ఎన్నిక‌లు: విజ‌య‌వాడ జ‌య‌హో బీసీ మ‌హాస‌భ‌లో సీఎం వైఎస్ జ‌గ‌న్ ఫైర్

  • Published Dec 07, 2022 | 4:19 PM Updated Updated Dec 07, 2022 | 4:19 PM
బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులు, చంద్రబాబుకు ఇదే చివ‌రి ఎన్నిక‌లు:  విజ‌య‌వాడ జ‌య‌హో బీసీ మ‌హాస‌భ‌లో సీఎం వైఎస్ జ‌గ‌న్ ఫైర్

నిజాయితీకి, వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరగబోతోంది. చేసిన మంచిని ప్రజలకు చెబుతూనే, 2024 ఎన్నికల్లోనూ ఇంతకు మించిన గెలుపు ఖాయమని చెప్పాలని సీఎం వైస్ జగన్ కార్యకర్తలను కోరారు. టీడీపీ హ‌యాంలో బీసీల‌కు అన్యాయం జ‌రిగింది. అదే మ‌న పాల‌న‌లో మాత్రం బీసీలు భాగస్వామ్య‌య్యార‌ని గ‌ర్వంగా చెప్పారు. ఇదే విష‌యాన్ని విప‌క్ష‌నేత చంద్ర‌బాబుకు చెప్ప‌మ‌ని విజ‌య‌వాడ జ‌య‌హో బీసీ మ‌హాస‌భ‌లో పిలుపునిచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ మారీచులతోనూ, పెత్తందారులతోనూ యుద్ధం చేయకతప్పదని, 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలని ప్ర‌క‌టించారు.

ఖ‌బ‌డ్దార్…. మీ అంతు చూస్తాన‌ని, తోక‌లు క‌త్తిరిస్తాన‌ని బెదిరించాడు. కాని, బీసీలు రాజ్యాధికారంలో కూడా భాగ‌స్వాముల‌నే విష‌యాన్ని చంద్రబాబుకు చెప్పమ‌న్నారు. అంతేనా? బీసీల‌కిచ్చిన హామీలు ఏమ‌య్యాయ‌ని చంద్ర‌బాబుకు గుర్తుచేమ‌ని అన్నారు.

చేసిందేమీలేక అబ‌ద్ధాల‌తో మోసం చేయాల‌ని చేస్తున్నారు. చెప్పుకోవ‌డానికి బీసీల కోసం ఒక్క మంచి ప‌ని కూడా చేయ‌లేదు. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ5, ద‌త్త‌పుత్రిడినే న‌మ్ముకొంటున్నాడు. మీ బిడ్డ జ‌గ‌న్ వ‌య‌స్సు 49 ఏళ్లు. అదే చంద్రబాబు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి 45ఏళ్లు అవుతోంది. కాని 2024 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీలో దిగుతాన‌ని చెప్ప‌లేక‌పోతున్నాడు.

మీ ఇంట్లో మంచి జరిగితేనే, జగనన్నకు తోడుగా ఉండండి. లేక‌పోతే వద్దని జగనన్నే చెప్పాడని చెప్పండి. జగన్ చెప్పింది చేస్తాడు, బాబును నమ్మొద్దు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చే కల్లబొల్లి హామీలను నమ్మొద్దని కోరారు. మన బిడ్డను సీఎం చేసుకొందామ‌ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్ప‌మ‌న్న సీఎం, ఇకపై గడపగడపకు మీరు కూడా వెళ్లడం ఇక మొదలు కావాలి, ప్రతి 50 ఇళ్లకు ఒకరిని మ్యాపింగ్ జరగాలి, వ‌చ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు సాధించాలని గుర్తు పెట్టుకోవాలని కోరారు.

చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపించలేదన్న సీఎం జగన్, ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించారని, మూడున్నరేళ్లలో ఎనిమిది రాజ్యసభ స్థానాల్లో సగం బీసీలకే ఇచ్చామని గుర్తు చేశారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలేన‌ని, 32 మంది ఎమ్మెల్సీలలో 18 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైన్టార్టీలే ఉన్నారన్నార‌ని చెప్పారు సీఎం జ‌గ‌న్. శాసన సభ స్పీకర్‌గా బీసీ నేత తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్‌గా ఎస్సీ నేత మోషేన్‌రాజును నియమించామని జ‌య‌హో బీసీ స‌భ ముందుంచారు. రెండో విడత కేబినెట్‌లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఉన్నారు, గ్రామ సచివాలయాల్లో లక్షా 30 వేల ఉద్యోగుల్లో 84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని చెప్పారు. బీసీల‌కు బ‌డ్జెట్ లోనే కాదు మా గుండెల్లోనే స్థాన‌మిచ్చామని చెప్పారు.

బీసీ కులాల‌ల‌కు ఇచ్చిన హామీల‌న్నింటిని అమ‌లు చేశామ‌ని ప్ర‌క‌టించిన సీఎం జ‌గ‌న్, సంక్షేమ ప‌థ‌కాల్లోనూ పేద‌సామాజిక వ‌ర్గాల‌కే ప్రాధాన్య‌త‌నిచ్చాం. ఆర్ధిక సాధికారత‌కోసం రూ.3ల‌క్ష‌ల 19వేల 228 కోట్లు ఖ‌ర్చే చేశామ‌ని చెప్పారు. ఇందులో 80శాతం మేర నిధులు పేద‌ల‌కే ఇచ్చాని చెప్పారు.

రాష్ట్ర అప్పులు పెరుగుతున్నాయ‌న్న ఎల్లోమీడియా క‌థ‌నాల‌ను ప్ర‌స్తావించిన సీఎం జ‌గ‌న్, చంద్రబాబు హ‌యంలో అప్పుల పెరుగుద‌ల 19శాతం. అదే ఇప్పుడు 15శాత‌మ‌న్న వాస్త‌వాన్ని ప్ర‌క‌టించారు. దోచుకో…పంచుకో…తినుకో…ఇదే చంద్ర‌బాబు విధాన‌మ‌ని ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు హ‌యాంలో ప‌థ‌కాలు ఎందుకు లేవో ప్ర‌జ‌లే ఆలోచించుకోవాల‌ని కోరారు.