P Krishna
P Krishna
భారత దేశంలో మహిళలకు ఎంతో గౌరవం ఇస్తుంటారు. దేశంలో మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారు. పురుషులతో సమానంగా విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో ముందుకు సాగుతున్నారు. భర్తకు సహాయంగా కుటుంబ భారాన్ని మోస్తున్నారు. ఈ మద్యనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా మహిళల కాళ్లు కడిగి వారిని గౌరవించారు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ వస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మధ్యప్రదేవ్ లో మహిళా సంక్షేమం కోసం తీసుకు వచ్చిన ‘లాడ్లీ బెహనా ఆవాస్ యోజన’ పథకాన్ని ప్రారంభించారు సీఎం శివరాజ్ సింగ్. కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా కొంతమంది మహిళల కాళ్లు కడిగి వారికి హారతులిచ్చి వారిపై పూల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సన్మానం అందుకున్న మహిళలు ముఖ్యమంత్రి ని ఆశీర్వదిస్తు హర్షం వ్యక్తం చేశారు.
अपने लिए जिये तो क्या जिये… pic.twitter.com/NBftIV5FEf
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) October 4, 2023