iDreamPost
android-app
ios-app

మేకల కాపరిగా మారిన చదువుల తల్లి… CM రేవంత్ రెడ్డి స్పందనతో..

  • Published Jul 25, 2024 | 12:17 PMUpdated Jul 25, 2024 | 12:17 PM

CM Revanth Reddy Help To JEE Ranker: జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకు సాధించినా.. ఆర్థిక పరిస్థితి అనుకూలించక మేకల కాపరిగా మారిందో చదువుల తల్లి. ఇది కాస్త సీఎం రేవంత్‌ దృష్టికి చేఉడంతో.. ఆయన దీనిపై స్పందించారు. ఆ వివరాలు..

CM Revanth Reddy Help To JEE Ranker: జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకు సాధించినా.. ఆర్థిక పరిస్థితి అనుకూలించక మేకల కాపరిగా మారిందో చదువుల తల్లి. ఇది కాస్త సీఎం రేవంత్‌ దృష్టికి చేఉడంతో.. ఆయన దీనిపై స్పందించారు. ఆ వివరాలు..

  • Published Jul 25, 2024 | 12:17 PMUpdated Jul 25, 2024 | 12:17 PM
మేకల కాపరిగా మారిన చదువుల తల్లి… CM రేవంత్ రెడ్డి స్పందనతో..

ప్రస్తుతం మన సమాజంలో చదువుకునే పరిస్థితులు లేవు.. చదువుకొనే స్థితిలో ఉన్నాం. మెరుగైన, నాణ్యమైన విద్య లభించాలంటే.. భారీగా ఖర్చు చేయాలి. ప్రతిభ మాత్రం ఉంటే సరిపోదు.. సరస్వతి కటాక్షం పొందాలంటే.. లక్ష్మీదేవి అనుగ్రహించాలి. లేదంటే.. మనలో ఎంత టాలెంట్‌ ఉన్నా కొన్ని సందర్భాల్లో చేతిలో డబ్బులు లేకపోతే.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టం. ఏటా పది, ఇంటర్‌, పోటీ పరీక్షల్లో మంచి మార్కులు, ర్యాంకులు సాధించిన ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం.. ఆర్థిక సమస్యల వల్ల పైచదువుల అంశంలో వెనకడుగు వేస్తున్నారు. ఇక తాజాగా ఓ యువతి గురించి ఇలాంటి వార్తే వచ్చింది. జేఈఈ మెయిన్స్‌లో 824వ ర్యాంకు సాధించి.. ఐఐటీ పాట్నాలో సీటు వచ్చినా.. ఆర్థిక పరిస్థితి అనుకూలించక.. మేకల కాపరిగా మారింది.

చదువుల తల్లికి ఎంత కష్టం పేరిట.. మీడియా, సోషల్‌ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. దాంతో ఈ అంశం కాస్త ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టికి చేరింది. ఆయనపై దీనిపై స్పందిస్తూ.. పేద విద్యార్థిని ఆదుకోవాలని సూచించారు. ఆమెకు తగిన ఆర్థిక సాయం అందించాలని తెలిపారు. ఆ వివరాలు..

Topper in studys

రాజన్న సిరిసిల్ల వీర్నపల్లి మండలం గోనే నాయక్ తండాకు చెందిన బదావత్ సరోజ రాములు దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద వాళ్లు ఇద్దరు డిగ్రీ పూర్తి చేసి.. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సాయం చేస్తున్నారు. ఇక మూడో కుమార్తె మధులత మాత్రం చదువులో టాపర్‌. ఈ క్రమంలోనే ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపి ఎస్టీ కేటగిరిలో 824వ ర్యాంక్ సాధించింది. పాట్నా ఐఐటీలో సీట్ వచ్చింది. అయితే అక్కడ జాయిన్‌ కావాలంటే రూ. 3 లక్షల ఫీజు చెల్లించాలి. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబానికి.. 3 లక్షలు అంటే కొండంత భారమనే చెప్పవచ్చు. చేసేదేం లేక.. తను కూడా తల్లిదండ్రులకు సాయం చేస్తూ.. మేకల కాపరిగా మారింది.

అయితే ఆమె ఆర్థిక ఇబ్బందులు, మేకల కాపరిగా మారిన ఫొటోలు మీడియా, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దాతలేవరైనా ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరారు. దాంతో ఈ విషయం కాస్త.. తెలంగాణ సీఎంఓ దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మధులతను హైదరాబాద్ పిలిపించారు. ఆమె చదువు పూర్తి చేసేందుకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధులు అందేలా ఏర్పాట్లు చేశారు. మధులతని ప్రతిభని ప్రశంసించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. ఆమె చదువులో రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి