నేడే టీ హబ్ ప్రారంభం.. కొత్త ఆవిష్కరణలకు మరో అందలం

నాలుగు వేలకు పైగా అంకురాలకు వసతి కల్పించేలా నిర్మితమైన ప్రపంచచంలో అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణంగా టీహబ్ నిలిచింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ చేతులమీదుగా టీ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో రూ.400 కోట్ల వ్యయంతో, మూడు ఎకరాల స్థలంలో ..

తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ హబ్ ప్రారంభానికి ముస్తాబైంది. విద్యుత్ కాంతులతో భవనం జిగేల్ మంటోంది. ఆ ఫోటోను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. నాలుగు వేలకు పైగా అంకురాలకు వసతి కల్పించేలా నిర్మితమైన ప్రపంచచంలో అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణంగా టీహబ్ నిలిచింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ చేతులమీదుగా టీ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో రూ.400 కోట్ల వ్యయంతో, మూడు ఎకరాల స్థలంలో .. రెండు బేస్ మెంట్లు, 10 అంతస్తులతో 53.65 మీటర్ల ఎత్తులో నిర్మితమైంది టీ హబ్. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, సైయింట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, టీహబ్ సీఈఓ శ్రీనివాసరావు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.

టీ హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీశాఖ కూ యాప్ తో పాట హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, హీరోమోటార్స్, పొంటాక్, వెబ్ 3 సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకోనుంది. ఉదయం 9.30 గంటలనుంచే టీ హబ్ భవనంలో డ్రమ్ జామ్ తో కార్యక్రమం మొదలైంది. టీ హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. కొత్త భవనంలో పెద్దఎత్తున ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామన్నారు.జులై 1వ తేదీ నుంచి 250 కంపెనీలు టీ హబ్ లో చేరుతాయన్నారు. టీ హబ్ పక్కనే నిర్మించిన టీ వర్క్స్ బిల్డింగ్ ను కూడా వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు.

Show comments