iDreamPost
iDreamPost
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ కు వచ్చారు. ఇటీవలే దేశ వ్యాప్త పర్యటన కోసం ఆయన ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిదే. కొన్ని రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల నేతలతో ఆయన సమావేశం కావాల్సి ఉంది. సమాజ్ వాదీ పార్ట చీఫ్ అఖిలేష్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ అయిన.. హఠాత్తుగా హైదరాబాద్ కు రావడం పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఆయన హఠాత్తుగా ఎందుకు హైదరాబాద్ కు వచ్చారనేది తెలియరావడం లేదు.
ఈ నెల 20వ తేదీన దేశ రాజధానికి వెళ్లిన ఆయన.. 21 అఖిలేష్, 22 ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు. రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 600 కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారి కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున పరిహారం అందచేశారు. 2022, మే 25వ తేదీ మంగళవారం, మే 26వ తేదీ బుధవారం సీఎం కేసీఆర్ పలువురు ప్రముఖులతో భేటీ కావాల్సి ఉంది. అర్ధాంతరంగా ఆయన పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే.. జాతీయ రాజకీయ వర్గాల్లో చక్రం తిప్పుతానని సీఎం కేసీఆర్ ముందే ప్రకటించారు. ముందు సంచలనం చూస్తారని సీఎం కేజ్రీవాల్ తో భేటీ అయిన అనంతరం ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ కూడా విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ లేకపోవడం ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతాయనే ఉద్ధేశ్యంతో ఆయన ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని హైదరాబాద కు వచ్చినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.