iDreamPost
android-app
ios-app

జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో రూ.25వేలు జమ!

జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో రూ.25వేలు జమ!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తనదైన పరిపాలనతో దేశంలోని ఇతర రాష్ట్రాలకే ఆదర్శంగా నిలుస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. అలానే విద్యా, వైద్య విషయంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా యువతకు, పిల్లలకు చదువు భారం కాకూడదని.. అనేక పథకాలు అమలు చేస్తున్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి వంటి ఇతర అనేక పథకాల ద్వారా విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటికే అనేక శుభవార్తలు చెప్పిన సీఎం జగన్ తాజాగా మరో శుభవార్త చెప్పారు.  యువ న్యాయవాదుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు, యువతకు ఆర్థికంగా, ఉపాధి పరంగా భరోసా కల్పిస్తుంది. ఇప్పటికే ఎంతో ఆర్థిక సాయం అందించిన జగన్ ప్రభుత్వం.. మరోసారి యువ న్యాయవాదులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్సార్ లా నేస్తం కింద సోమవారం విడుదల చేయనున్నారు. 2023-24 ఏడాదికి తొలివిడత  కింద అర్హులైన 2,677 మంది యంగ్ లాయర్ల అకౌంట్ లో నెలకు రూ.5 వేల చొప్పున జమ చేయనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఐదు నెలలకు ఒక్కొక్కరి అకౌంట్లలో రూ.25 వేలు జమకానున్నాయి.  సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు.

వైఎస్సార్ లా నేస్తం కింద మొత్తం రూ.6,12,65,000 జమ చేయనున్నారు.  కొత్తగా లా గ్రాడ్యూయోషన్ పూర్తి చేసిన యువ న్యాయవాదులు వృత్తిలో  స్థిరపడేలా మూడేళ్ల పాటు ఏడాదికి రూ.60 వేల చొప్పున రెండు విడతల్లో జగన్ ప్రభుత్వం చెల్లిస్తుంది. అలా మొత్తం రూ.1.80 లక్షల ఆర్థిక సాయం జగన్ సర్కార్ అందిస్తుంది. తాజాగా విడుదల చేస్తున్న ఆర్థిక సాయంతో కలిపి ఇప్పటి వరకు 5,781 మంది  యువ న్యాయ వాదులకు రూ41.52 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించింది. వైఎస్సార్ లా నేస్తం కింద ఆర్థిక ప్రోత్సాహంకం పొందాలంటే  అర్హతలు.. దరఖాస్తుదారులు ఏపీకి రాష్ట్రానికి చెందినవారై  ఉండాలి.

న్యాయశాస్త్రంలో  బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 2016 లేదా ఆ తరువాత డిగ్రీ పాసైన వారు అర్హులు. కుటుంబంలో ఒకరికే ఈ పథకం వర్తిస్తుంది.  అలానే భార్యాభర్తలు ఉండే ఒకరే అర్హులు అవుతారు.  మూడేళ్లు ప్రాక్టీస్ దాటిన జూనియర్ న్యాయవాదులు  అర్హులు కారు. నాలుగు చక్రాల వాహనం కలిగిన దరఖాస్తుదారులు అర్హులు కాదు. మరి.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పిన ఈ శుభవార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.