iDreamPost
iDreamPost
దవోస్ లో సీఎం జగన్ ఏపీ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రపంచం ముందుంచారు. డీకార్బనైజ్డ్ మెకానిజంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం జగన్ ఇటీవల కర్నూలులో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ పంప్డ్ స్టోరేజ్ రెన్యువబుల్ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. ఏపీలో ఏర్పాటు చేసిన కర్బన రహిత పవర్ ప్రాజెక్టు ద్వారా, విండ్, హైడల్, సోలార్ విద్యుత్‌ను నిరంతరాయంగా ఉత్పత్తి చేయవచ్చని అన్నారు. ఖర్చ తక్కువ. ఎలాంటి కాలుష్యం లేదు. అదే సమయంలో విద్యుత్ ను సాధించవచ్చన్నారు. అంతేకాకుండా హైడ్రోజన్, అమ్మోనియంలను కూడా పొందవచ్చని సీఎం జగన్ చెప్పారు. ఇలాంటి టెక్నాలజీతో 33,000 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఏపీలో ఉందని, ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. పర్యావరణాన్ని ప్రేమించేవాళ్లు, బిగ్ థింకింగ్ ఉన్న వారికి ఏపీలో అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం జగన్ మరోసారి ప్రకటించారు.
ప్రపంచంలోనే అతి పెద్దదైన కర్బన రహిత పవర్ ప్రాజెక్టు గురించి దావోస్ కు వివరించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి విషయంలో ఏపీ కొత్త ట్రెండ్‌ను నెలకొల్పిందన్నారు గర్వంగా చెప్పారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి షోకేస్‌గా, కర్నూలు ప్రాజెక్టు నిలుస్తుందన్నారు. పంప్డ్ స్టోరేజీ ద్వారానే 1650 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమంటే అసాధారణమని అన్నారు.
ఈ కార్యక్రమంలో నీతి అయోగ్ చైర్మన్ అమితాబ్‌కాంత్ మాట్లాడారు. కర్బణ రహిత పవర్ ఉత్పత్తికి, ఇండియాలో పరిస్థితులు అనుకూలమని, వాటిని ఏపీ ఒడిసిపట్టుకుందని ఆయన ప్రశంసించారు. ఈ రోజు ఏపీ అమలు చేస్తున్న టెక్నాలజీ రేపు ప్రపంచం అంతా అనుసరించక తప్పదని, ఏపీ కర్బన రహిత పారిశ్రామిక విధానంపై ప్రశంసలు కురిపించారు. గ్రీన్ ఎనర్జీ కోసం ఏపీ సీఎం పాలసీ బాగుందని ఆయన అన్నారు.
27 దేశాలను పరిశీలించిన తర్వాతనే ఏపీలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్టు ఆర్సెల్లార్ ప్రతినిధి ఆదిత్య మిట్టల్ ప్రకటించారు. తమ పెట్టుబడులు రెట్టింపు చేస్తామన్నారు. స్టీల్ ఉత్పత్తి సెక్టార్ నుంచి 8 శాతం కార్బన్ విడుదల అవుతుంది. కాని, ఏపీలో గ్రీన్ పాలసీకి అనుగుణంగా ఉత్పత్తి చేయబోతున్న హైడ్రోజన్‌ను, స్టీలు పరిశ్రమలో ఉపయోగించి, ఉక్కు రంగంలో కర్బన్ ఉద్గారాలను తగ్గిస్తామన్నారు. త్వరలో, ఏపీలో తొలి పునరుత్పాదక పవర్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పారు.