ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రజా సంక్షేమానికి ఏ విధంగా కృషి చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేద ప్రజలకు విద్యా, వైద్యంతో పాటు ఆర్ధిక భరోసా కల్పించేలా సీఎం జగన్ తన పాలనను సాగిస్తున్నారు. ఎన్నో అద్భుతమైన పథకాలతో తండ్రికి మించిన తనయుడని సీఎం జగన్ రుజువు చేసుకున్నారు. అలానే మంచి మనస్సుతో సాయం కోరి వచ్చిన వారిని ఆదుకోవడంలో సీఎం జగన్.. వైఎస్సార్ ని గుర్తు చేస్తున్నారు. తమ సమస్యలతో జగన్ వద్దకు వచ్చిన వారికి.. తానే స్వయంగా వారితో మాట్లాడి..తక్షణమే సమస్యలను పరిష్కరించే వారు. తాజాగా కురుపాం పర్యాటనలో అలాంటి ఘటనలు చాలా చోటుచేసుకున్నాయి. వివిధ సమస్యలతో బాధ పడుతున్న వారిని సీఎం జగన్ మనసున్న మారాజుగా ఆదుకున్నారు.
జగనన్న అమ్మ ఒడి నిధులను విడుదల చేసేందుకు బుధవారం సీఎం జగన్ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ సమస్యలతో తన వద్దకు వచ్చిన వారికి 24 గంటల వ్యవధిలోనే సాయం చేశారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లి గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి గుదే జియశ్రీకి బోన్‌మెరో ట్రాన్స్‌ప్లాంటేషన్ కారణంగా పెరుగుదల లోపించింది. చికిత్స కోసం బెంగళూరుకు తరలించాలని వైద్యులు సూచించారు. అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో చిన్నారి తల్లి గౌరి సీఎం జగన్ కు తన బాధను వెల్లడించింది.
వెంటనే స్పందించిన సీఎం.. ఆ చిన్నారి వైద్యం కోసం రూ.10 లక్షలు సాయం అందిస్తామని తెలిపారు. అలానే తక్షణ సాయంగా రూ.లక్ష అందజేయాలని కలెక్టర్ నిషాంత్‌కుమార్‌ను ఆదేశించారు. అదే విధంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న పార్వతీపురంకి చెందిన ఎనిమిదేళ్ల బేతా హాసిని వైద్యం కోసం ఇప్పటికే చాలా ఖర్చు చేశారు. ఆర్థికంగా చితికిపోయిన తమను, తమ పాపను ఆదుకోవాలని బాలిక తండ్రి శ్రీనివాసరావు సీఎం జగన్ కి విన్నవించారు. తక్షణ సాయం రూ.3 లక్షలను ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదే విధంగా మరో 11 మంది కూడా సీఎం జగన్ కు వారి సమస్యలు తెలిపారు.
వారందరి సమస్యలను సీఎం ఎంతో ఓపికగా విన్నారు. అలానే వారందరికి తక్షణ సాయంగా రూ.లక్ష చొప్పున మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. 24 గంటలు గడవక ముందే కలెక్టర్, ప్రజా ప్రతినిధులు బాధితులందరికీ చెక్కులు అందజేశారు. సీఎం ఉదారత పట్ల బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ స్పందించిన విధానానికి ఏపీ ప్రజలు ఫిదా అవుతున్నారు. మరి.. బాధితుల సమస్యల పట్ల సీఎం జగన్ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.