iDreamPost
android-app
ios-app

విడుదలకు ముందు ఎన్నో సవాళ్లు

  • Published Jul 08, 2021 | 12:06 PM Updated Updated Jul 08, 2021 | 12:06 PM
విడుదలకు ముందు ఎన్నో సవాళ్లు

ఎట్టకేలకు వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడికి సురేష్ బాబు, వెంకటేష్ ఒక అడుగు వెనక్కు వేసినట్టు ఫిలిం నగర్ టాక్. నారప్పను ఓటిటి రిలీజ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నాక అభిమానుల నుంచి వ్యక్తమైన నిరసనతో పాటు డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎదురైన వ్యతిరేకతను జాగ్రత్తగా విశ్లేషించిన సురేష్ యూనిట్ సభ్యులు నారప్పను థియేటర్లలో తీసుకురావాలనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆ మేరకు నిర్ణయం మార్చుకున్నట్టు తెలిసింది. గతంలో నాగార్జున కూడా అచ్చం ఇదే తరహాలో వైల్డ్ డాగ్ ని నెట్ ఫ్లిక్స్ కు ఇచ్చేశాక మళ్ళీ వెనక్కు తీసుకున్నారు. అయితే దానికి తగ్గ ఫలితం లభించలేదు. వసూళ్ళ పరంగా ఒరిగింది కూడా ఏమి లేదు.

కానీ నారప్ప కేసు వేరు. ఇది కులవివక్ష మీద రూపొందిన పక్కా మాస్ సబ్జెక్టు. సరిగ్గా కనెక్ట్ అయ్యేలా తీసుంటే మాత్రం అద్భుతాలు చేస్తుంది. ఒరిజినల్ వెర్షన్ చూసినవాళ్లు ఇది మన ఆడియన్స్ కి ఎంతమేరకు లింక్ అవుతుందో అనే దాని మీద సందేహాలు వ్యక్తం చేస్తున్న దాఖలాలు లేకపోలేదు. అయితే ఈ సినిమా నిర్మాణ భాగస్వామి అయిన కలైపులి థాను మాత్రం ఓటిటికే మొగ్గు చూపుతున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ముప్పై కోట్ల షేర్ తేవడం అంత సులభం కాదని అంటున్నారట. ఒకవేళ నష్టం వస్తే తన రెమ్యునరేషన్ నుంచి తగ్గించుకోమని కూడా వెంకీ అన్నట్టు అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం

మొత్తానికి నారప్ప వ్యవహారం అటుఇటు తిరిగి థియేటర్ల వద్దకే వచ్చిందన్న మాట. మరి ఒకవేళ ఇదే నిజమైతే ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది చూడాలి. ఆగస్ట్ లో అయితేనే సేఫ్ గేమ్ అవుతుంది. అందులోనూ సగం సీట్లు, సెకండ్ షోల రద్దు లాంటి పరిమితుల మధ్య వెంకటేష్ లాంటి పెద్ద హీరో అయినా సరే భారీ కలెక్షన్లు తేవడం అంత సులభం కాదు. అసలు కుటుంబాలు థియేటర్లకు ఏ మేరకు వస్తాయనేది ఓ రెండు వారాలు వేచి చూడాలి. ఆలోగా కరోనా పూర్తిగా మాయమైపోయి ప్రభుత్వాలు కనక మరిన్ని వెసులుబాట్లు ఇస్తే వకీల్ సాబ్ తరహాలో వసూళ్ల సునామిని ఆశించవచ్చు. చూడాలి ఏమేం జరగబోతోందో