Idream media
Idream media
అమరావతిలో జరిగిన భూ కుంభకోణాలు, అక్రమ వ్యవహారాలలో ప్రధాన పాత్రధారిగా ఉన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణపై సీఐడీ మెరుపుదాడులు చేసింది. రాజధాని ప్రాంతంలో అసైన్మెంట్ భూముల కుంభకోణంపై నారాయణపై అభియోగాలు రాగా.. కేసు నమోదు చేసిన సీఐడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. మాజీ సీఎం చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి నారాయణలు ఈ వ్యవహారంలో కీలక ప్రాత పోషించినట్లు సీఐడీ అభియోగాలు దాఖలు చేసింది. నిన్న మంగళవారం చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన సీఐడీ.. ఈ రోజు నారాయణకు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
నోటీసులు ఇచ్చిన సీఐడీ కేసు విచారణలో భాగంగా.. నారాయణ నివాసాలు, కార్యాలయాల్లో ఏక కాలంలో సోదాలు మొదలు పెట్టింది. నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్‌లలోని నారాయణ ఇళ్లులు, కార్యాలయాలు, విద్యా సంస్థల్లో సీఐడీ సోదాలు చేస్తోంది. 10 చోట్ల జరుగుతున్న ఈ సోదాల్లో పలు కీలక ఆధారాలను సీఐడీ స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. సీఐడీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
Also Read : ఏమిటీ అసైన్మెంట్ భూముల కేసు..? సీఎంగా చంద్రబాబు నేరం ఎలా చేశారు..?
రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో నారాయణ భూములు కొన్నారనే అభియోగాలపై గతంలో సీఐడీ, సిట్ కేసులు నమోదు చేసింది. సదరు సంస్థలు చేస్తున్న దర్యాప్తుపై టీడీపీ నేతలు కోర్టులను ఆశ్రయించగా.. ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రిం కోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది.
నారాయణ తన విద్యా సంస్థల్లో పని చేసే సిబ్బంది పేర్ల రాజధాని అమరావతిలో భారీ ఎత్తును భూములు కొన్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే అక్కడ భూములు కొనడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నారాయణ దాదాపు మూడు వేల ఎకరాలు కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఏపీ మంత్రివర్గ ఉపసంఘం ప్రాథమికంగా రాజధానిలో దాదాపు 4,070 ఎకరాలు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో కొనుగోలు చేసినట్లు నిర్థారించింది. సిట్ దర్యాప్తు కొనసాగితే.. ఈ మొత్తం భారీగా పెరగడంతోపాటు టీడీపీ నేతలు ఎవరెవరు ఎంత మొత్తం భూమి కొనుగోలు చేశారనేది వెల్లడవుతుంది.
Also Read : బాబు – సీఐడీ ఆఫీస్‌కు వస్తారా..? కోర్టుకు వెళతారా..?