iDreamPost
iDreamPost
అపరిచితుడుతో మనకూ బాగా దగ్గరైన చియాన్ విక్రమ్ తన కొడుకు ధృవ్ తో కలిసి నటించిన కొత్త సినిమా మహాన్ విడుదల త్వరలో అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్ గా జరుగుతుందని తెలిసి ఒక్కసారిగా అభిమానులు షాక్ తిన్నారు. ఇది అధికారికంగా చెప్పనప్పటికీ ట్విట్టర్ లోని కొన్ని వెరిఫైడ్ హ్యాండిల్స్ లో ఇది వార్తగా రావడంతో అంత ఈజీగా కొట్టిపారేయలేం. గతంలో ఇదే తరహాలో ఆకాశం నీ హద్దురా, వి, నిశ్శబ్దం లాంటి వాటికి సంబంధించిన న్యూస్ వచ్చినప్పుడు అవి తర్వాత నిజమయ్యాయి. దానికన్నా ముందు దర్శక నిర్మాతలు వాటిని కొట్టిపారేసి నప్పటికీ ఫైనల్ గా డిజిటల్ బాట పట్టక తప్పలేదు. ఇప్పుడు మహాన్ వంతు వచ్చింది.
ఈ సినిమాకు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ఇక్కడే లేనిపోని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇతను ధనుష్ హీరోగా తీసిన జగమే తంత్రం ఎంత పెద్ద డిజాస్టరో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. నేరుగా నెట్ ఫ్లిక్స్ లో రాబట్టి సరిపోయింది కానీ లేదంటే భారీ నష్టం వచ్చేదని సామాన్య ప్రేక్షకుడు సైతం అంగీకరించాడు. ఒకప్పుడు జిగర్ తండా లాంటి కమర్షియల్ క్లాసిక్స్ సృష్టించిన కార్తీక్ సుబ్బరాజ్ ఆ తర్వాత ఆ స్థాయి మేజిక్ చేయలేకపోతున్నాడు. రజినీకాంత్ తో తీసిన పేట కూడా అక్కడి అభిమానులను అలరించిందే తప్ప బయట రాష్ట్రాల్లో ఫ్లాప్ ముద్ర వేసుకున్నదే. అందుకే మహాన్ మీద డౌట్లు రావడం సహజం.
సో ఇప్పుడు ఈ సినిమా అవుట్ ఫుట్ కూడా ఏదైనా తేడా కొట్టిందా అనే చర్చ చెన్నై మీడియాలో జరుగుతోంది. ఇప్పటిదాకా ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ హీరోల నుంచి దీన్ని ఖండిస్తూ ఎలాంటి ట్వీట్ రాలేదు. ఒకవేళ ఈ రోజు ఏమైనా ఇస్తారేమో చూడాలి. తమిళనాట థియేటర్లు తెరిచారు. డాక్టర్ సగం ఆక్యుపెన్సీతోనే 90 కోట్లకు పైగా రాబట్టింది. నవంబర్ 1 నుంచి వంద శాతం అనుమతులు ఇచ్చేశారు. రజని పెద్దన్న దెబ్బకు రికార్డులు బద్దలు అనే అంచనాలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో నిజంగానే మహాన్ ఓటిటి వైపు మొగ్గు చూపిందా లేక ఇదంతా ఉత్తి ప్రచారమేనా అనేది తెలియాల్సి ఉంది.
ALSO READ – ప్రేమనగర్ కాంబోలో మరో క్లాసిక్ – Nostalgia