iDreamPost
android-app
ios-app

భోళా శంకర్ నుంచి జామ్ జామ్ జజ్జనక సాంగ్ రిలీజ్!

భోళా శంకర్ నుంచి జామ్ జామ్ జజ్జనక సాంగ్ రిలీజ్!

టాలీవుడ్ లో మెగాస్టార్ సినిమా అనౌన్స్ చేసిన దగ్గరి నుంచి ఆ మూవీ రిలీజ్ అయిన దాకా ఎంత హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మెగాస్టార్- మెహర్ రమేష్ కాంబినేషన్ లో భోళా శంకర్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా, కీర్తీ సురేష్, సుశాంత్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇంక మురళీ శర్మ, వెన్నెల కిశోర్, తాగుబోతు రమేష్, శ్రీముఖి, గెటప్ శ్రీను వంటి యాక్టర్స్ అయితే చాలా మందే ఉన్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ అన్నీ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇప్పుడు తాజాగా ఈ మూవీ నుంచి ఒక అదిరిపోయే పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. జామ్ జామ్ జజ్జనక అంటూ ఒక వీడియో సాంగ్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది. రెండ్రోజుల క్రితం ప్రోమో వచ్చినప్పటి నుంచి అభిమానులు ఈ పాట కోసం ఎదురుచూపులు మొదలు పెట్టారు. ఈ పాటలో బాస్ అదే గ్రేస్, అదే మాస్ తో ఇరగదీశాడు. ఈ పాటకు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అయితే ఉర్రూతలూగిస్తోంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్టెప్పులు అయితే నెక్ట్స్ లెవల్లో కంపోజ్ చేశారు.

ముఖ్యంగా మధ్యలో నర్సపల్లే అంటూ లిరిక్ మొత్తం మారిపోతుంది. అక్కడ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, శుశాంత్ వేసే మాస్ట్ స్టెప్స్ బాగా ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా సింగర్స్ అనురాగ్ కులకర్ణి, మంగ్లీ అయితే వారి గొంతుకతో ఈ పాటకు ప్రాణం పోశారు. ముఖ్యంగా కనకవ్వ ఫోక్ సాంగ్ నుంచి తీసుకు ప్లాట్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో కూడా కచ్చితంగా ఇంద్ర స్టైల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet