iDreamPost
android-app
ios-app

Acharya మాస్ ఆచార్య అదరగొట్టాడుగా

  • Published Apr 12, 2022 | 6:43 PM Updated Updated Apr 12, 2022 | 6:44 PM
Acharya మాస్ ఆచార్య అదరగొట్టాడుగా

మెగా ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్న ఆచార్య ట్రైలర్ ఇందాక థియేటర్లలో విడుదల చేశారు. యూట్యూబ్ లో ముందు 7 గంటలకని అనౌన్స్ చేసినప్పటికీ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేయడం కోసం గంట ముందుగానే రిలీజ్ చేశారు. వీడియోలో స్టోరీ గురించి మంచి క్లూస్ ఇచ్చారు. సినిమా కోసం ఎదురు చూసేలా గూస్ బంప్స్ ఎపిసోడ్స్ పొందుపరిచారు.

అనగనగా ధర్మస్థలి అనే పుణ్యక్షేత్రం. సిద్దా అదే మన రామ్ చరణ్ దానికి రక్షకుడు. దాని మీద కొందరు దుర్మార్గుల కన్ను పడుతుంది. నేరాలు ఘోరాలు చేస్తారు. కట్ చేస్తే కొంత కాలం తర్వాత అక్కడికి ఆచార్య అదేనండి మన మెగాస్టార్ వస్తాడు. రావడమే దీనికి కారణమైన ఆ కిరాతకుడికి వార్నింగ్ ఇస్తాడు. ఆ విలన్ ఎవరో కాదు. సోనూ సూద్. అప్పుడే ఆచార్యకు సిద్దాకు ఉన్న అనుబంధం బయట పడుతుంది. ఆ తర్వాత అతను ఏం చేశాడనేదే అసలు స్టోరీ

ట్రైలర్ అంతా ఒక ఎత్తు అయితే చివరి సెకండ్లలో చిరు చరణ్ లు కలిసి చేసే ఫైట్లు ఇంకో లెవెల్. వీటికి ఏప్రిల్ 29న థియేటర్లలో జరగబోయే అల్లరి ఏ రేంజ్ లో ఉండబోతోందో ఊహించుకోవడం కష్టమే. నక్సల్స్ డ్రెస్సులో ఇద్దరూ ఒకరికొకరు చేయి ఇచ్చుకుంటూ పోరాటాలు చేయడం మాములు మాస్ కాదు. దర్శకుడు కొరటాల శివ మళ్లీ మిర్చిని మించిన మాస్ మసాలా ఇందులో చూపించేశారు. మణిశర్మ మ్యూజిక్, పూజా హెగ్డే గ్లామర్, తిరు కెమెరా వర్క్ ఇవన్నీ ఆచార్యని కలర్ ఫుల్ గా ప్రెజెంట్ చేశాయి. ఫైనల్ గా చెప్పాలంటే 29త్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చూసేలా ట్రైలర్ తో ఆచార్య దుమ్ము దులిపేశాడు.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş