iDreamPost
iDreamPost
లాక్ డౌన్ కు ముందు భీష్మతో బ్లాక్ బస్టర్ అందుకుని చెక్ తో సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేద్దామని ఆశించిన నితిన్ కు చెక్ రూపంలో గర్వభంగం తప్పలేదు. మొన్న శుక్రవారంతోనే దాదాపుగా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న చెక్ ఇప్పుడు ఒకటి అరా ప్రధాన కేంద్రాల్లో తప్ప అన్ని చోట్ల సెలవు తీసుకుంది. విభిన్న చిత్రాలు తీస్తారని పేరున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి అన్ని రకాలుగా నిరాశపరచడంతో ఫైనల్ గా డిజాస్టర్ తప్పలేదు. జనానికి అంతగా కనెక్ట్ కాలేని చెస్ ఆటని మెయిన్ పాయింట్ గా తీసుకుని చెప్పిన విధానం లాజిక్స్ కి దూరంగా సాగడంతో మొత్తానికి ఫలితం చాలా ప్రతికూలంగా వచ్చింది.
సుమారు 16 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ చేసుకున్న చెక్ ఫైనల్ గా రాబట్టుకుంది 9 కోట్ల పై చిలుకు మాత్రమే. అంటే రికవరీ శాతం కేవలం యాభై శాతానికి కొంచెం పైన ఆగిపోయిందన్న మాట. అందులోనూ పెద్ద పోటీ లేకుండా వచ్చింది కాబట్టి ఈ మాత్రమైనా సాధ్యమయ్యింది కానీ లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో చెక్ నెగటివ్ షేర్స్ కూడా వచ్చాయి. ఉన్నంతలో నితిన్ కు పట్టుకున్న నైజామ్ లోనే కాస్త ఎక్కువ షేర్లు వచ్చాయి. సీడెడ్ లోనూ అతి కష్టం మీద కోటి మార్కు దగ్గరకు వెళ్ళింది కానీ దాటలేకపోయింది. ఇక ఏరియాల వారిగా చూస్తే చెక్ ఫైనల్ ఫిగర్స్ ఈ విధంగా ఉన్నాయి
చెక్ ఫుల్ రన్ వసూళ్లు:
ఏరియా | షేర్ |
నైజాం | 3.28cr |
సీడెడ్ | 0.98cr |
ఉత్తరాంధ్ర | 1.18cr |
గుంటూరు | 0.94cr |
క్రిష్ణ | 0.56cr |
ఈస్ట్ గోదావరి | 0.47cr |
వెస్ట్ గోదావరి | 0.55cr |
నెల్లూరు | 0.29cr |
ఆంధ్ర+తెలంగాణా | 8.25cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 0.35cr |
ఓవర్సీస్ | 0.72cr |
ప్రపంచవ్యాప్తంగా | 9.33cr |
ఇక ఇప్పుడు చేయగలిగింది ఏమి లేదు. ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూడటం తప్ప ఉన్న కాసిన్ని సెంటర్ల నుంచి చెక్ కు వచ్చేదేమి లేదు. ఈ నెల 26న రాబోతున్న రంగ్ దే మీద నితిన్ ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టేశాడు. చెక్ తాలూకు ప్రభావం దాని మీద పెద్దగా ఉండే అవకాశం లేదు. కీర్తి సురేష్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, వెంకీ అట్లూరి టేకింగ్ ఇవన్నీ యూత్ లో ప్రత్యేకంగా అంచనాలు పెంచుతున్నాయి. దీంతో మళ్ళీ హిట్ కొడితే చెక్ తాలూకు చేదు అనుభవాల నుంచి త్వరగా బయట పడవచ్చు. మొత్తానికి థియేటర్లు తెరుచుకున్నాక ప్రేక్షకులు కంటెంట్ కు తప్ప స్టార్లకు పట్టం కట్టకపోవడం గమనించవచ్చు
Verdict – Disaster