iDreamPost
android-app
ios-app

ప్రభాస్ ప్లానింగ్ లో అనూహ్య మార్పులు

  • Published Sep 19, 2020 | 7:41 AM Updated Updated Sep 19, 2020 | 7:41 AM
ప్రభాస్ ప్లానింగ్ లో అనూహ్య మార్పులు

సాహో తర్వాత అంతకన్నా ఎక్కువ బడ్జెట్ తో రూపొందిస్తున్న రాధే శ్యాం షూటింగ్ కొనసాగించేందుకు ఎదురు చూస్తున్న డార్లింగ్ ప్రభాస్ ఇప్పటికే రెండు సినిమాలు సైన్ చేసి వాటి అధికారిక ప్రకటనలతో అబిమానులకు స్వీట్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటికే ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే తాజాగా కెజిఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని కూడా ఓకే చేసినట్టు తాజా అప్ డేట్. ప్రశాంత్ జూనియర్ ఎన్టీఆర్ తో చేయొచ్చని గత కొద్దినెలలుగా వినిపిస్తూనే ఉంది. కాని తారక్ ఆర్ఆర్ఆర్ పూర్తి చేశాక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జాయిన్ అవుతాడు. ఇదంతా జరిగేలోపు 2021 అయిపోతుంది. అప్పటిదాకా ప్రశాంత్ నీల్ ఖాళీగా ఉండటం కష్టం. అందుకే ఈలోగా ప్రభాస్ కో పవర్ ఫుల్ సబ్జెక్టు చెప్పాడట.

వందల కోట్ల బడ్జెట్ అవసరం లేకుండా హీరోయిజంని బాగా ఎలివేట్ చేసే పక్కా కమర్షియల్ కథ చెప్పినట్టు వినికిడి. సింగల్ సిట్టింగ్ లో ప్రభాస్ ఓకే చేసినట్టు సమాచారం. కేజిఎఫ్ కు ముందు ప్రశాంత్ నీల్ తీసింది ఒక్క సినిమానే. దాని పేరు ఉగ్రం. మాఫియా బ్యాక్ డ్రాప్ లో సింపుల్ స్టొరీనే అయినప్పటికీ యాక్షన్ ఎపిసోడ్లు, ఎలివేషన్లతో దాన్ని సూపర్ హిట్ చేసి చూపించారు. అదే ఫార్ములాని ఇక్కడా వాడబోతున్నట్టు తెలిసింది. ఇక్కడ మరో ట్విస్టు ఉంది. రాధే శ్యాం తర్వాత ఇదే ముందు పూర్తి చేయొచ్చని తెలుస్తోంది. తర్వాత ఆది పురుష్ సెట్స్ పైకి తీసుకెళ్తారట. ఖచ్చితంగా ఆరు నెలల్లోపే పూర్తి చేసేలా దర్శకుడు ఓం రౌత్ ఇప్పటికే పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు ముంబై టాక్.

నాగ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతి మూవీస్ నిర్మించే సినిమాకు విపరీతమైన బడ్జెట్ తో పాటు ఆంక్షలు లేని షూటింగ్ లొకేషన్లు, విదేశీ ప్రయాణాలు ఉండటంతో దాని చివర్లో మొదలుపెడతారని తెలుస్తోంది. అంటే ఇంకో రెండేళ్ల తర్వాత కానీ ఇది వచ్చే అవకాశాలు ఉండవు. ఈ లెక్కన చూస్తే ముందు చెప్పుకున్నట్టు కాకుండా ప్రభాస్ సినిమాల సంఖ్య మారడం ఖాయం. రాధే శ్యామ్ తో కలిపి మొత్తం నాలుగు సినిమాలకు ప్రభాస్ కమిట్ అయిపోవడం చూస్తే 2024 దాకా దాదాపు బ్లాక్ అయినట్టే. అందులోనూ రెండు పాన్ ఇండియా బడ్జెట్ సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం కావడం సహజమే. ఇక వచ్చే వేసవిని టార్గెట్ చేసుకుంటున్న రాధే శ్యామ్ వచ్చే నెల నుంచి షూటింగ్ ని రీ స్టార్ట్ చేసే అవకాశాలను పరిశీలిస్తోంది