iDreamPost
android-app
ios-app

చంద్రయాన్ 3 సక్సెస్! ఇక ల్యాండర్, రోవర్ చేయబోయే పని ఇదే!

చంద్రయాన్ 3 సక్సెస్! ఇక ల్యాండర్, రోవర్ చేయబోయే పని ఇదే!

కొన్నేళ్ల కలను ఇస్రో శాస్త్రవేత్తలు నిజం చేసి చూపించారు. చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోయింది. ఈ క్షణం కోసం గత 40 రోజులుగా 132 కోట్ల భారతీయులు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. ఆ క్షణం రానేవచ్చింది. విక్రమ్ ల్యాండర్ సక్సెస్ ఫుల్ గా చంద్రుడిని ముద్దాడింది. ఇప్పటివరకు ఏ దేశం చూడని చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ అడుగు పెట్టింది. ఈ ప్రయోగంతో అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. సాయంత్రం 5.47 ప్రారంభమైన ప్రధాన ఘట్టం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ విజయంవంతంగా చంద్రుడిపై దిగడంతో పూర్తైంది. ఈ విజయంతో భారతీయులు సగర్వంగా జయహో భారత్ అంటూ నినాదాలు చేస్తున్నారు. చంద్రయాన్-3 తరువాత సక్సెస్ తరువాత  జరగబోయేది ఏంటనేది అందరిలో ఆసక్తి నెలకొంది. మరి..  ఆ వివరాల ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

చంద్రయాన్-3 పరిశోధన్ లో ప్రధానమైన ప్రొషల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్లు. వీటిలో ఏడు రకాల పరికరాలను ఇస్రో అమర్చింది. ల్యాండర్ లో నాలుగు, రోవర్ లో రెండు, ప్రొపల్షన్ మాడ్యూల్‌ లో ఒక పరికరం ఉన్నాయి. విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌లు రెండు చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ల్యాండ్ అయిన తర్వాత వాటి జీవితం కాలం ఒక లూనార్ డే.  ఇక చంద్రయాన్ లోని అమర్చిన పరికారాలు పని చేయడానికి,  అవి సేకరించిన సమాచారం భూమికి పంపడానికి  విద్యుత్ అవసరం అందుకు కోసమే వాటికి సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి..దాని నుంచి విద్యుత్ వస్తుంది.

చంద్రయాన్ 3 కమ్యూనికేషన్‌ లో విక్రమ్ ల్యాండర్ కీలకంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రగ్యాన్ రోవర్‌తో ఇది కమ్యూనికేట్ చేస్తుంది. రోవర్‌తో పాటుగా, చంద్రయాన్-2లో ప్రయోగించిన ఆర్బిటర్‌తో కూడా ఇది  కమ్యూనికేట్ చేస్తుంది. ల్యాండర్ మాడ్యూల్‌ లో కీలకమైన పేలోడ్స్‌ని అమర్చింది. ఈ పరికరం జాబిల్లి ఉపరితలంపై ప్లాస్మా సాంద్రతను పరిశీలిస్తుంది. అక్కడన్న అయాన్లు, ఎలక్ట్రాన్ల స్థాయిని, అలానే కాలంతో పాటు వాటిలో వస్తున్న మార్పుల సమాచారాన్ని సేకరిస్తుంది. రోవర్ తనకున్న ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపై సంచరిస్తుంది.

ఈ రోవర్ కేవలం ల్యాండర్ తో మాత్రమే కమ్యూనికేట్ చేయగలుగుతుంది. అక్కడి నుంచి మీ ఇస్రో స్పేస్ సెంటర్ కు పంపిస్తుంది. రోవర్ లో రెండు కీలక పరికరాలున్నాయి. లిబ్స్ అనే పరికరం చంద్రుడిపై ఉపరితలంపై 14 రోజుల పాటు తిరుగుతూ మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, టైటానియం వంటి మూలకాల ఉనికి గుర్తిస్తుంది. అలానే అపక్స్ అనేది చంద్రుడి ఉపరితలంపైన ఉన్న మట్టి, రాళ్లలో సమృద్ధిగా ఉన్న రసాయన సమ్మేళనాలను కనిపెడుతుంది. దీని వల్ల చంద్రుడి ఉపరితలం గురించి, అక్కడి మట్టి గురించి మరింత అవగాహన పెంచుకోవడం ద్వారా మరింత వేగంగా భవిష్యత్ ప్రయోగాలకు కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. మరి.. చంద్రయాన్-3 సక్సెస్ పై మీ అభినందనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చంద్రయాన్-3 విజయం వెనుక ఉన్న హీరోలు వీరే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి