iDreamPost
android-app
ios-app

ఎక్స్‌టార్డినరీ ఫర్మామెన్స్‌.. టీడీపీ ఎమ్మెల్సీలకు చంద్రబాబు కితాబులు

  • Published Jan 22, 2020 | 5:31 AM Updated Updated Jan 22, 2020 | 5:31 AM
  • Published Jan 22, 2020 | 5:31 AMUpdated Jan 22, 2020 | 5:31 AM
ఎక్స్‌టార్డినరీ ఫర్మామెన్స్‌.. టీడీపీ ఎమ్మెల్సీలకు చంద్రబాబు కితాబులు

శాసన సభలో వైఎస్సార్‌సీపీ సభ్యుల మాటల తూటాలకు తమ సభ్యులు ఎదురు దాడి చేసిన నిరుత్సాహ పరిస్థితి ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి శాసన మండలిలో మాత్రం మంచి ఊరట లభించింది. నిన్న మంగళారం శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు చంద్రబాబుకు అమితానందాన్ని కలిగించినట్లుంది. తన సంతోషాన్ని ఈ రోజు ఆయన టీడీపీ ఎమ్మెల్సీలతో పంచుకున్నారు. వారిని అభినందించి ఈ రోజు మరింత జోరుతో వ్యవహరించేలా ఉద్యుక్తులను చేశారు.

Read Also: తెలుగుదేశానికి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు షాక్.

తన ఛాంబర్‌లో టీడీపీ ఎమ్మెల్సీలతో సమావేశమైన చంద్రబాబు.. ‘‘అందరికీ కంగ్రాచ్యులేషన్‌.. చాలా బాగా చేశారు.. ఎక్స్‌టార్డినరీ ఫర్మామెన్స్‌..’’ అంటూ కితాబులు ఇచ్చారు. ‘‘ మీరు లోపలున్నారు. నేను టీవీ ముందు కూర్చున్నాను. అప్‌డేట్స్‌ చూస్తున్నాను. ఎప్పటికప్పడు వివరాలు తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రిని డమ్మీ కాంగ్రెస్‌ అన్నారు. మంత్రులు వచ్చినప్పుడు మీరు వెళ్లారు. గొడవ పడ్డారు. 

’’అశోక్‌ బాబులో రౌడీయిజాన్ని చూశాం. నాగజగదీష్‌పైకి మంత్రులు వచ్చినప్పుడు వారిపైకి వెళ్లారు. బెజవాడ రౌడీ అని పించుకున్నారు’’ అని కొంత మంది ఎమ్మెల్సీలు చంద్రబాబుకు వివరించారు. అశోక్‌ బాబు మంత్రులను కొట్టేవారంటూ నారా లోకేష్‌ ఆయన వ్యవహరించిన తీరును బాబుకు చెప్పారు. విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి.. పై నుంచి మంత్రులకు ఇండికేషన్‌ ఇస్తున్నారు. వారు ఏదో ఒకటి చేసేలా ఆదేశాలు ఇస్తున్నారంటూ లోకేష్, ఇతర ఎమ్మెల్సీలు చంద్రబాబుకు వివరించారు.

Read Also: మండలి బిల్లును తిరస్కరించగలదా ?

వారు చెప్పినవన్నీ విన్న చంద్రబాబు ఎక్స్‌టోడ్నరీ ఫర్మామెన్స్‌.. చాలా బాగా చేశారు.. అంటూ మరో మారు అభినందించారు. నారా లోకేష్‌.. చంద్రబాబునాయుడు గారి నాయకత్వం వర్థిల్లాలని నినాదాలు చేయగా.. ప్రతిగా టీడీపీ ఎమ్మెల్సీలు లోకేష్‌కు గొంతు కలిపారు. చంద్రబాబు ఇచ్చిన ఉత్సాహంతో ఈ రోజు టీడీపీ ఎమ్మెల్సీలు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet