Idream media
Idream media
సందర్భానికి తగినట్లుగా మాట్లాడేవాడే రాజకీయ నాయకుడు అనేది ఓ నానుడి. అయితే ఇలా మాట్లాడేవారికి ఇవి రోజులు కావు. కానీ ఆ నానుడు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలికి అతికినట్లు సరిపోతుంది. తాను ఈ తరహా నాయకుడనేనని చంద్రబాబు నాయుడు తరచూ నిరూపించుకుంటూనే ఉన్నారు. తాజాగా ఆయన మూడో సారి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ప్రభుత్వంపై చేస్తూ.. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ చేయించాలని ఏకంగా ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసి తన వ్యవహారశైలిని చాటుకున్నారు.
తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ చంద్రబాబు చేస్తున్న విమర్శల్లో వాస్తవం ఎంత అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం అటుంచితే.. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ చేయించాలని ఆయన ప్రధానికి లేఖ రాయడమే ఇక్కడ విడ్డూరంగా ఉంది. ఈ చర్య చంద్రబాబు సందర్భానికి తగినట్లుగా ఎలా మాట్లాడారో మరోసారి చాటిచెప్పింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఏపీలోకి రావడానికి వీలులేదన్నారు. తాము దీనికి ఒప్పుకోబోమని ఏకంగా జీవోనే జారీ చేసిన ఘనత చంద్రబాబుది. ఈ జీవో జారీ చేయడానికి ఏర్పడిన పరిస్థితులు తెలిసినవే.
ఇది జరిగి కేవలం రెండు సంవత్సరాలే కావస్తోంది. ఈ విషయం ప్రజలు కూడా ఇంకా మరచిపోలేదు. అయితే చంద్రబాబు మాత్రం ఇవేమీ గుర్తులేవన్నట్లుగా.. తనకు తానే ఆరోపణలు చేసి, పోలీసులకు కూడా ఫిర్యాదు చేయకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని ప్రధానికి లేఖ రాయడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. నాడు నేడు అంటూ చంద్రబాబు సీబీఐపై రెండేళ్ల కిత్రం చేసిన వ్యాఖ్యలు, తాజాగా చేసిన డిమాండ్ తాలుకూ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాలం గడిచేకొద్దీ విషయాలను ప్రజలు మరిచిపోతార్నది కొంత వరకూ వాస్తవమే. అయితే ఆయా విషయాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసేందుకు సోషల్ మీడియా ఉందన్న విషయం రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాల్సిన విషయం, చంద్రబాబు తీరుగా తాము కూడా సందర్భానుసారంగా రాజకీయాలు చేస్తామంటే ప్రజా జీవితానికి ఫుల్‌స్టాఫ్ పడినట్లే.
Read Also ; అడవి బిడ్డలకూ ‘భరోసా’