iDreamPost
android-app
ios-app

చంద్రబాబూ మీ భూ కుంభ కోణాలు మరిచి వైఎస్ జగన్ సర్కార్ పై ఆధారాలు లేని ఆరోపణలా?

చంద్రబాబూ మీ భూ కుంభ కోణాలు మరిచి వైఎస్ జగన్ సర్కార్ పై ఆధారాలు లేని ఆరోపణలా?

తాను చేస్తే సంసారం వేరేవాళ్లు చేస్తే వ్యభిచారం అనే నానుడి ఉంది. అంతేకాదు తన తప్పులను తెలుసుకోకుండా వేరేవాళ్లపై నెట్టేయడం కూడా చాలా సులువు. తనలాగే అందరూ తప్పులు చేస్తారని అనుకోవడం సహజమే. అయితే వీటి గురించి ఇప్పుడు చెబుతున్నామంటే..సరిగ్గా వీటినన్నింటికి సరిపడే నేత ఒకరు ఉన్నారు. ఆయనే రాష్ట్ర ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు. ఈమధ్య హైదరాబాదులో కూర్చోని రాష్ట్ర ప్రభుత్వంపైనా, వైఎస్ జగన్ పైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

తాను చేసిన కుంభకోణాలు అందరూ చేస్తారని అనుకుంటున్నారు చంద్రబాబు. తన హయంలో జరిగిన కుంభకోణాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయని ఆయన అనుకుంటున్నారు. ఆయనకేం తెలుసు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి. చంద్రబాబు చేసిన విమర్శల్లో భాగంగానే భూ కుంభకోణం ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు.

ఇటీవలి చంద్రబాబు భూ కుంభకోణంపై మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ కుంభ కోణం జరుగుతుంది ఆరోపణలపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ ఆరోపణలు ట్విట్టర్ వేదికగా చేశారు.

“పేదలకు ఇళ్ల స్థలాలంటూ భూసేకరణను వైసిపి ప్రభుత్వం కుంభకోణంగా మార్చింది. అధిక ధరకు భూములను ప్రభుత్వంతో కొనిపించి దోపిడీకి పాల్పడ్డారు. ఇళ్ల స్థలాల పేరుతో ప్రతి నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయాల అవినీతికి పాల్పడ్డారు. ఇప్పుడు పేదల నుంచి వసూళ్ల దందాకు వైసిపి తెరలేపింది. పేదల సంక్షేమంలోనూ దోపిడీకి పాల్పడిన చరిత్ర వైసిపిదే” అని ఒట్టి ఆరోపణలు చేశారు. అంతేతప్ప ఆయన హయంలోని జరిగిన భూ కుంభకోణం గురించి మరిచిపోయారు. రాజధాని భూ కుంభకోణం దేశం మొత్తం చూశారుగా. అది మరిచారా? చంద్రబాబు.

అలాగే టిడిపి చేపట్టిన సామూహిక గృహ ప్రవేశాలు దేశానికే నమూనా అయిందని మరో అద్భుతమైన వ్యాఖ్య చేశారు. దేశంలో రాష్ట్రం అవినీతిలో మొదటి స్థానంలో నిలిపిన ఘనత చంద్రబాబుదే. అదే దేశానికి నమూనా అయింది అనుకుంటున్నారా? చంద్రబాబు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఇక అవినీతి రహిత సంక్షేమ రాష్ట్రంగా ఉంది. ఇది కూడా చంద్రబాబు మరిచారు. తన హయంలో జరిగిన కుంభకోణాలు, అవినీతి మరిచిన చంద్రబాబు, ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న ఆదర్శ పాలనను కూడా చంద్రబాబు మరిచిపోతున్నారు.

అందుకే చంద్రబాబు వైఎస్ జగన్ పాలనపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. ఇవి కేవలం తన ఎల్లో మీడియాలోనే ప్రచారం అవుతున్నాయి. అందుకనే వైఎస్ జగన్ ను అక్కున చేర్చుకున్న రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు ఆరోపణలను, విమర్శలను పెద్దగా పట్టించుకోవటం లేదు.