iDreamPost
iDreamPost
మార్కెట్ లోకి వచ్చిన కొత్త వెహికల్స్ ని మొదట సొంతం చేసుకోవాలని కొంతమంది అనుకుంటే, మరికొంతమంది తమ వెహికల్ కి ఫ్యాన్సీ నంబర్ ఉండాలని గట్టిగా ప్రయత్నిస్తారు. ఈ ఫ్యాన్సీ నంబర్ల కోసం లక్షలు పోసేవాళ్ళు ఉన్నారు. ఆర్టీవో ఆఫీసులో వేలంపాటల్లో లక్షలు పోసి ఫ్యాన్సీ నెంబర్లు కొనేవాళ్లు తక్కువేంకాదు. కాకపోతే వాళ్లంతా ఖరీదైన కార్లకి ఫ్యాన్సీ నెంబర్లు కావాలనుకొంటారు. ఓ వ్యక్తి 71 వేలకు కొన్న హోండా యాక్టివా బండికోసం వేలంపాటలో, ఫ్యాన్సీ నంబర్ కోసం 15.44 లక్షలు తగలెట్టాడు.
చండీఘడ్ కు చెందిన బ్రిజ్ మోహన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. ఈనెలలోనే రూ.71 వేలు పెట్టి హోండా యాక్టివా కొన్నాడు. దానికో ఫ్యాన్సీ నంబర్ కావాలి. చండీగఢ్ ఆర్టీవో అధికారులు ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఫ్యాన్సీ నెంబర్ల వేలం నిర్వహిస్తే, కొత్త సిరీస్ సీహెచ్01- సీజే-0001 నెంబర్ ఉంది. ఈ సీరీస్ కోసం డబ్బున్నవాళ్లు చాలామంది వేలంపాడారు. బ్రిజ్ మోహన్ ఐతే సీహెచ్01- సీజే-0001 కోసం రూ.15.44 లక్షలు వేలంపాడాడు.
పావలా కోడికి ముప్పావలా మసాలా? అని అడిగితే హోండా యాక్టీవాకు ఈ ఫ్యాన్సీ నెంబర్‌ను వాడతా. త్వరలో కారు కొంటాను. ఆ కారుకి కూడా సేమ్ ఫ్యాన్సీ నెంబర్‌ను ఉపయోగిస్తానన్నది బ్రిజ్ మోహన్ మాట. చండీగఢ్ లో ఫ్యాన్సీ నెంబర్లు క్రేజ్ ఎక్కువ. మిలీనియర్లు ఎక్కువమంది కాబట్టి, రేట్లుకూడా బాగానే పలుకుతాయి. ఈ వేలంలో మొత్తం 378 మంది ఫ్యాన్సీ నంబర్లని కొంటే కోటి 50 లక్షల ఆదాయం వచ్చింది.