Krishna Kowshik
రష్మిక డీప్ ఫేక్ వీడియోపై బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్, తెలుగు స్టార్స్ నాగ చైతన్య, మృణాల్ ఠాకూర్, సాయి థరమ్ తేజ్ స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. తాజాగా కేంద్రం కూడా స్పందించింది.
రష్మిక డీప్ ఫేక్ వీడియోపై బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్, తెలుగు స్టార్స్ నాగ చైతన్య, మృణాల్ ఠాకూర్, సాయి థరమ్ తేజ్ స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. తాజాగా కేంద్రం కూడా స్పందించింది.
Krishna Kowshik
హీరోయిన్లకు ఇప్పుడిప్పుడే గుర్తింపు ఉండే పాత్రలు వస్తున్నాయి. కేవలం కొన్ని సీన్లు, పాటలకు పరిమితం చేయడం లేదు. వారి చుట్టూ కథ అల్లుతూ మూవీస్ రూపొందిస్తున్నారు దర్శక నిర్మాతలు. షూటింగ్స్, యాడ్స్ అంటూ ఉన్న కాస్త పాటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న తరుణంలో సోషల్ మీడియాలో వీరిపై బురద జల్లేందుకు యూజర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. టెక్నాలజీని దుర్వినియోగపరుస్తూ.. నటీమణులను అభాసుపాలు చేస్తున్నారు. మామాలుగా తమపై రూమర్స్ వస్తే లైట్ తీసుకుంటారు హీరోయిన్స్. కానీ ఈ సారి ఏకంగా వీడియోలు మార్ఫింగ్‌లు చేసి నెట్టింట్లో చక్కర్లు కొట్టేలా చేస్తున్నారు. తాజాగా బాధితురాలు అయ్యింది కన్నడ కస్తూరి, బ్యూటీ రష్మిక మందన్నా.
రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని లిఫ్ట్ లోకి వచ్చినట్లు కనిపించిన వీడియో నిమిషాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ఖంగుతిన్న రష్మిక.. ఆ వీడియో ఫేక్ అంటూ చెప్పింది. ఏఐ టెక్నాలజీతో బ్రిటిష్-ఇండియన్ ఇన్‌ఫ్లూయెన్సర్ జరా పటేల్ రూపొందించిన వీడియోపై బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబచ్చన్ నుండి టాలీవుడ్ హీరోస్ నాగ చైతన్య, సాయి థరమ్ తేజ్, మృణాల్ ఠాకూర్ స్పందించారు. బీఆర్ఎస్ మహిళా నేత కవిత ఆమెకు మద్దుతునిచ్చారు. ఈ వీడియోపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇలాంటి మార్పింగ్ వీడియోలు అత్యంత ప్రమాదకరమైన చర్యగా పేర్కొంది. ఇలాంటి వీడియోలను కట్టడి చేయాల్సిన బాధ్యత సామాజిక మాధ్యమాలేదనని స్పష్టం చేసింది. ఇలాంటి వీడియోలు చేసి, సర్క్యులేట్ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా సోషల్ మీడియా కంపెనీలకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఐటి యాక్ట్ 2000లోని సెక్షన్ 66డి ప్రకారం కంప్యూటర్ వనరులను వినియోగించి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా మోసం చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా ఉంటుందని కేంద్ర ఐటి ప్రసార శాఖ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ స్పష్టం చేశారు. తమ తమ సోషల్ మీడియా ఖాతాల నుండి నకిలీ లేదంటే తప్పుడు సమాచారం పోస్టు కాకుండా చూసుకోవాలని సూచించారు. తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తే .. 36 గంటల్లోగా తొలగించాలని వెల్లడించారు. అలాగే ఏప్రిల్ లో జారీ చేసిన ఐటి నిబంధనల ప్రకారం.. సోషల్ సైట్స్ చట్టపరమైన బాధ్యతలను పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లేకుంటే చర్యలు తప్పవని పేర్కొన్నారు.