iDreamPost
android-app
ios-app

ఆర్గానిక్ వెంట పడుతున్న సెలబ్రిటీలు..

ఆర్గానిక్ వెంట పడుతున్న సెలబ్రిటీలు..

ఇప్పుడు ప్రపంచమంతా ఆర్గానిక్ ఫార్మింగ్ వెనుక నడుస్తోంది. మనం తింటున్నది కల్తీ ఆహారమో ?సహజసిద్ధంగా పండిన ఆహారమో? తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజలంతా ఉన్నారు. అందుకే నెమ్మదిగా ఆర్గానిక్ ఫార్మింగ్ మీద స్పృహ పెరుగుతుంది.. ఆఖరికి అపార్ట్మెంట్లలో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయవచ్చని కొంత మంది చేసి చూపించారు కూడా. అయితే నెమ్మది నెమ్మదిగా సెలబ్రిటీలలో కూడా ఈ స్పృహ బాగా పెరుగుతోంది. సాధారణంగానే వాళ్ళు చాలా హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. అయినా అనారోగ్యాలకు గురి అవుతూ ఉన్న కారణంగా ఎక్కడ సమస్య మొదలైంది అనే విషయం తెలుసుకుంటే, మనం తీసుకునే ఆహారమే ఆరోగ్యానికి గాని అనారోగ్యానికి కారణం అనే విషయం అర్థమైంది. అందుకే టెన్షన్ తీసుకోకుండా ఇప్పుడు సినీ సెలబ్రిటీలు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద దృష్టి పెడుతున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ లో నిర్మాత సురేష్ బాబు, నటులు ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మాత్రమే కాక హీరోయిన్ సమంత లాంటి వాళ్లు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఇప్పటికే దిగేశారు. ఇప్పుడు తాజాగా ఈ విషయంలో అల్లు అర్జున్ కూడా చొరవ తీసుకుని ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలు పెట్టారని తెలుస్తోంది. అల్లు అర్జున్ తాజాగా రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివారు శంకర్పల్లి మండలంలో రెండు ఎకరాల భూమి కొన్నారని, ఆ రిజిస్ట్రేషన్ నిమిత్తం అక్కడి తహసీల్దార్ ఆఫీస్ కి వెళ్లగా అక్కడి ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ల్యాండ్ లో అల్లు అర్జున్ ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలుపెట్టబోతున్నారని తెలుస్తోంది.

అయితే ఒక పక్క హెల్త్ గురించి ఆలోచిస్తూనే మరోపక్క ప్రకృతిని ఆస్వాదించవచ్చనే మరో ఉద్దేశం కూడా అల్లు అర్జున్ కి వచ్చిందట. దానికి కారణం పుష్ప సినిమా షూటింగ్. పుష్ప సినిమా కథ ప్రకారం అధిక భాగం అడవుల్లోనే షూట్ చేశారు. ఆ సమయంలో సాధారణంగానే ప్రకృతి ప్రేమికుడైన అల్లు అర్జున్ ప్రకృతితో మరింత ప్రేమలో పడ్డాడని, హైదరాబాద్ వంటి కాంక్రీట్ జంగిల్ లో కాకుండా శివార్లలో రణగొణ ధ్వనులు లేని ప్రదేశంలో తన చేతులతో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ అక్కడ అ సమయం గడిపడం కోసమే ఈ సెటప్ అంతా ప్లాన్ చేశారని తెలుస్తోంది. మొత్తం మీద అల్లు అర్జున్ మాత్రమే కాదు టాలీవుడ్ నటీనటులందరూ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద దృష్టి పెడుతున్నారు అనేది కాదనలేని వాస్తవం. భవిష్యత్తులో సామాన్య ప్రజలు కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ నే ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెలబ్రటీలలా ఎకరాల్లో భూములు కొని చేయలేకపోవచ్చు కానీ అపార్ట్మెంట్లలో లేదా తమ తమ ఇళ్ల పరిధిలో మొక్కలు పెంచుకునే అవకాశాలు లేకపోలేదు.

Also Read : రౌడీ హీరో సినిమా ఆలస్యం తప్పదా