Idream media
Idream media
జీఎన్ రావు కమిటీ నివేదికపై రాజధాని అమరావతిలోని కొన్నిగ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. మందడం గ్రామంలో రైతులు రోడ్లను మూసివేసి నిరసనలకు దిగారు. టెంట్లు వేసుకుని ఆందోళనలు చేస్తున్నారు. రాకపోకలను అడ్డుకుంటున్నారు. రహదారులకు వాహనాలు అడ్డంగా పెట్టి ధర్నా చేస్తున్నారు.
రైతుల ఆందోళనకు మద్దతుగా ప్రతిప„ý నేత చంద్రబాబు నేడు సోమవారం అమరావతి గ్రామాల్లో పర్యటించనున్నారు. మరికొద్ది సేటపల్లో ఆయన ఆయా గ్రామాలకు వెళ్లనున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించనున్నారు.
అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలనే లక్ష్యంతో మూడు రాజధానుల ప్రతిపాదనను జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అంతకు ముందు అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా కమిటీ నివేదికలో ఉన్న అంశాలనే ప్రస్తావించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ నివేదికలో పేర్కొంది.
కాగా, జీఎన్ రావు కమిటీ నివేదిక, ప్రభుత్వ నిర్ణయంపై రాయలసీమ, కొస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంత గ్రామాలు మినహా గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేయకపోవడం గమనార్హం.