iDreamPost
android-app
ios-app

రాజధానిలో అలజడికి యత్నించిన చంద్రబాబును అరెస్ట్ చేయాలి

రాజధానిలో అలజడికి యత్నించిన చంద్రబాబును అరెస్ట్ చేయాలి

చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరిట రైతుల భూములు లాక్కొని, రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించావు . సాగు భూములను నేడు బీడు భూములుగా మార్చి,అన్నదాత కడుపు మాడ్చి అయిదేళ్లు నియంతలా వ్యవహరించిన నువ్వు, ఇప్పుడు రాజధాని లో ఏ మొహం పెట్టుకుని పర్యటించడానికి వెల్లావని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారూమూరు వెంకట రెడ్డి ప్రశ్నించారు. గురువారం చుండూరు లో వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్ర బాబు పాలనలో రాజధాని పేరుతో రైతులను మోసం చేసి,భూములు ఇచ్చిన రైతులను గాలికి వదిలేశారాన్నారు. ఒక్క శాశ్వత కట్టడం నిర్మించకుండా రైతులు ఇచ్చిన భూములతో రియల్ వ్యాపారం సాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మూడు సార్లు శంకుస్థాపన చేసి వందల కోట్లు తగలేసి ఇన్ని సంవత్సరాలు ఆ ప్రాంతాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఆ ప్రాంతంలోకి వెళ్లి ఆ నేలను ముద్దాడుతూ ముద్దులు పెడుతున్నట్టు చంద్రబాబు ఇస్తున్న ఫోటో ఫోజులకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువేనన్నారు.

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు మూడేళ్లలో భూములను అభివృద్ది చేసి, ప్లాట్లు ఇస్తామని నమ్మబలికారు. రాజధాని ప్రాంతం లో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలన్నీ మాఫీచేస్తామని నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములిచ్చిన రైతుల పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తీరా భూములు తీసుకున్నాక వారిని బిక్షగాల్లుగా చూశారని ఆవేదన చెందారు. రాజధాని పేరిట రైతుల భూములు లాక్కొని వంచించిన బాబు రాజధాని ప్రాంత రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పి రావాలని వారు డిమాండ్ చేశారని అన్నారు.వారి డిమాండ్ లను పట్టించుకోని చంద్ర బాబు ఆ ప్రాంతంలో గొడవలు సృష్టించడానికి చంద్రబాబు అండ్ రౌడీ బ్యాచ్ కలసి పెయిడ్ గూండాలను వెంటబెట్టుకొని వచ్చి అరాచకం సృష్టించాలని ప్రయత్నించారన్నారు.

రైతులంటే ఎప్పుడూ చంద్రబాబు కి చిన్నచూపే అని అన్నారు. అంతకముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు పెంచిన విద్యుత్తు చార్జీలు తగ్గించమని హైదరాబాద్ లోని బషీర్ బాగ్ లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతులపై కాల్పులు జరిపించి రైతుల ప్రాణాలు తీసిన ద్రోహి చంద్రబాబు కాదా అని ఆయన గుర్తు చేశారు. 2014 లో రైతు రుణాలు బేషరతుగా మాఫీ చేస్తాను అని కనీసం వడ్డీలు కూడా మాఫీ చేయకుండా మోసం చేశాడు అని అలానే రాజధాని పేరు చెప్పి మూడు పంటలు పండే పచ్చటి పొలాలను బలవంతంగా లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, తన బినామీలకు,సింగపూర్ సంస్థలకు దోచిపెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు అని అన్నారు. ఇటు వంటి వ్యక్తుల పై చెప్పులు వేయటం లో తప్పులేదని అన్నారు..