iDreamPost
android-app
ios-app

Chandra babu – కాస్త పెద్ద మ‌న‌సు చాటుకుంటే ఇంకా బాగుండేది?

Chandra babu – కాస్త పెద్ద మ‌న‌సు చాటుకుంటే ఇంకా బాగుండేది?

త‌మిళ‌నాడులో జ‌రిగిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో ఏపీకి చెందిన సాయితేజ వీర‌మ‌ర‌ణం పొందాడు. దేశ సేవ కోసం ఆర్టీలో చేరిన సాయితేజ‌ కేవలం తొమ్మిదేళ్లలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌కి సెక్యూరిటీగా సేవలందించే స్థాయికి చేరుకున్నాడు. విధుల్లో అంకిత‌భావం, చొర‌వ‌తో అతి త‌క్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. త‌మ బిడ్డ దేశ సేవ‌లో ఉన్న‌త‌స్థాయిలో ఉన్నాడ‌ని సంబ‌ర‌ప‌డిపోతున్న ఆ కుటుంబానికి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం విషాదం నింపింది. ఆ వీరుడికి దేశం నివాళి అర్పిస్తోంది. ఎంతో మంది ఆ కుటుంబానికి హార్థికంగా, ఆర్థికంగా సాయ‌మందిస్తున్నారు. గ‌తేడాది జ‌మ్మూకాశ్వీర్ లో ఉగ్ర‌వాదుల దాడిలో చ‌నిపోయిన చిత్తూరు జిల్లా వాసి కుటుంబానికి ఏపీ ప్ర‌భుత్వం రూ. 50 ల‌క్ష‌ల సాయం ప్ర‌క‌టించింది. ఇప్పుడు అదే జిల్లాకు చెందిన సాయితేజ కుటుంబానికి కూడా త‌గిన సాయం అందించేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు కూడా రూ. ల‌క్ష సాయం అందించి త‌న ఉదార‌త‌ను చాటుకున్నారు. అక్క‌డ వ‌ర‌కూ బాగుంది కానీ.. ప్ర‌భుత్వానికి ఆయ‌న‌ చేసిన సూచ‌న‌లు, డిమాండ్ల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో ప్ర‌తీ అంశంపైనా సోష‌ల్ మీడియా లో చ‌ర్చ జ‌రుగుతోంది. బాబు స‌హాయంపై కూడా అదే త‌ర‌హా చ‌ర్చ మొద‌లైంది. చంద్ర‌బాబు ఆషామాషీ వ్య‌క్తి కాదు. ఆర్థికంగా కూడా స్థితిమంతుడే. ప‌ద్నాలుగేళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ఏపీకి సేవలు అందించారు. అలాంటి వ్య‌క్తి కేవ‌లం రూ. ల‌క్ష మాత్ర‌మే స‌హాయం ప్ర‌క‌టించ‌డం ఒక ఎత్త‌యితే.. రూ. కోటి ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేయ‌డం మ‌రో ఎత్తు. ఇప్పుడిదే సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

సాయి తేజ భార్య శ్యామల, తమ్ముడు మహేష్ తో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. తాము సాయి తేజ ఫ్యామిలీకి అన్ని విధాలా అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అదే నేరుగా క‌లిసి ఆ కుటుంబాన్ని ఓదారిస్తే ఇంకా బాగుండున‌నే అభిప్రాయాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. తాను వ్యక్తిగతంగా చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌ నాయక్‌ సాయితేజకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని లేఖలో తెలిపారు. ఇది ఓకేకానీ, ట్ర‌స్ట్ త‌ర‌ఫున లేదా, త‌న వ్యాపార సంస్థ‌ల త‌ర‌ఫున అయినా సాయం ప్ర‌క‌టించ‌డంలో కాస్త పెద్ద మ‌న‌సు చూపాల్సింద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, క‌నీసం త‌క్ష‌ణం స్పందించారు.. ఎంతో కొంత సాయం ప్ర‌క‌టించారు అందులో త‌ప్పేముంద‌న్న వాద‌న‌లూ వినిపిస్తున్నాయి. సాయం స‌రే.. ప్ర‌భుత్వం కూడా త‌గిన విధంగా స్పందిస్తే మేల‌ని ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఓ స్టేట్ మెంట్ ఇస్తే స‌రిపోయేదానికి లేఖ రాయ‌డం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మేన‌న్న‌ అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Also Read : ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది బాబూ.. జవాన్‌ కుటుంబానికి మీరేమిస్తున్నారు..?