iDreamPost
android-app
ios-app

క్యాట్ లో కూడా వెంకటేశ్వరరావుకి చుక్కెదురు

క్యాట్ లో కూడా వెంకటేశ్వరరావుకి చుక్కెదురు

ఏపీ ప్రభుత్వ మాజీ ఇంటిలిజెన్స్‌ ఛీప్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర పరిపాలన ట్రిబ్యూనల్‌ (క్యాట్‌)లో చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వం తనను సస్పెండ్‌ చేయడాని సవాల్‌ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై విచారించిన క్యాట్‌ ఈ రోజు మంగళవారం తీర్పు వెలువరించింది. ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.

ఏబీ వెంకటేశ్వర రావుపై వచ్చిన ఆరోపణలపై ప్రాధమిక విచారణ  చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికను కేంద్ర హోం శాఖ కు అందచేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర హోం శాఖ కు చెందిన అధికారి రాజీవ్ కుమార్ నిగమ్.. ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ ను సమర్ధిస్తూ, ఏప్రిల్ 7 లోగా అతనిపై ఛార్జ్ షీట్ నమోదు చెయ్యాలని ఈ నెల 7వ తేదీన రాష్ట్రప్రభుత్వానికి సూచించారు.

పోలిసు శాఖ ఆధునీకరణ పేరుతో ఏబీ వెంకటేశ్వరరావు 25 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, దేశభద్రతకు సంబంధించిన విషయంలో ఇజ్రాయిల్ కంపెనీతో సమాచారాన్ని పంచుకున్నారని రాష్ర ప్ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వర రావుని సస్పెండ్ చేసి అతని మీద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా క్యాట్‌లోనూ ఏబీకి ఊరట దక్కకపోవడంతో ఆయనకు చిక్కులు తప్పేలా లేవు. క్యాట్‌ తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచే వీలుంది. వచ్చే నెల 7వ తేదీలోపు ఏబీ అక్రమాలపై ఛార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉంది.