iDreamPost
android-app
ios-app

వీడియో : ఈ ‘పిల్లి’ తెలివి చూస్తే మతి పోతుంది!

  • Published Jul 25, 2023 | 8:44 AM Updated Updated Jul 25, 2023 | 8:44 AM
  • Published Jul 25, 2023 | 8:44 AMUpdated Jul 25, 2023 | 8:44 AM
వీడియో : ఈ ‘పిల్లి’ తెలివి చూస్తే మతి పోతుంది!

మనుషులకే కాదు.. జంతువులకు కూడా తెలివి ఉంటుంది. మనిషంతలా కాకపోయినా అవి కూడా బాగానే ఆలోచించగలవు. మనం వాటికి కొద్దిగా ట్రైనింగ్‌ ఇస్తే చాలు.. అద్భుతాలు చేస్తాయి. కుక్కలు, ఎలుకలు, పిల్లులు ఇలా చాలా రకాల జంతువులు మనుషుల ఆలోచనలకు దగ్గరగా పని చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి అవి చేసే పనులు చూస్తే మన మతి పోక మానదు. తమను ప్రేమగా పెంచుకునే యజమానులకు రక్షణ కల్పించే విషయంలోనూ.. వారు చెప్పింది చేయటంలోనూ ఇవి ఎప్పుడూ ముందుంటాయి.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ పిల్లి పిల్ల తన యజమాని చూపించిన ఓ కాయిన్‌ ట్రిక్‌ను సెకన్లలో నేర్చేసుకుంది. నేర్చేసుకోవటమే కాదు.. కాయిన్‌ ట్రిక్‌ చేసి చూపించింది. అతడు ఆ కాయిన్‌ను తన చేత్తో మాయం ఎలా చేయాలో ఆ పిల్లి పిల్లకు రెండు, మూడు సార్లు చేసి చూపించాడు. తర్వాత దాన్ని కూడా చేయమని కాయిన్‌ను దాని కాలి మీద పెట్టాడు. అది వెంటనే కాయిన్‌ను మాయం చేసి చూపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఈ పిల్లి తెలివి చూస్తే మతి పోతోంది’’.. ‘‘ మనుషులకే కాదు.. జంతువులకు కూడా తెలివి ఉంటుంది’’..‘‘  ఇలాంటి పిల్లుల్ని చూస్తే ముచ్చుటేస్తుంది’’.. ‘‘ ఓ పిల్లి పిల్ల కాయిన్‌ ట్రిక్‌ను ఇంత తొందరగా నేర్చుకుని చేయటం ఇదే మొదటి సారి అనుకుంటా’’.. ‘‘ పిల్లులు దేన్నైనా ఇట్టే నేర్చేసుకుంటాయి’’ అంటూ ఆ పిల్లి పిల్లను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి, కాయిన్‌ ట్రిక్‌ చేసిన ఈ పిల్లి పిల్ల తెలివిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibom