SNP
తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ 6 నుంచి మూడు వారాల పాటు నిర్విరామంగా ఈ సర్వే చేపట్టుకున్నారు. ఈ కులగణనను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాల టీచర్లతో, అలాగే మండట రీసోర్స్ సెంటర్ల సిబ్బందితో నిర్వహించనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ 6 నుంచి మూడు వారాల పాటు నిర్విరామంగా ఈ సర్వే చేపట్టుకున్నారు. ఈ కులగణనను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాల టీచర్లతో, అలాగే మండట రీసోర్స్ సెంటర్ల సిబ్బందితో నిర్వహించనున్నారు.
SNP
తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ 6 నుంచి మూడు వారాల పాటు నిర్విరామంగా ఈ సర్వే చేపట్టుకున్నారు. ఈ కులగణనను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాల టీచర్లతో, అలాగే మండట రీసోర్స్ సెంటర్ల సిబ్బందితో నిర్వహించనున్నారు. ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్ల, 3414 మంది ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంలు, 6256 మంది ఎంఆర్‌సీలు, 2 వేల మంది మినస్టీరియల్ సిబ్బంది కలిపి.. మొత్తం 48,229 మంది ఈ సర్వేలో పాల్గొననున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాఠశాలలో పనిచేసి.. ఆ తర్వాత సర్వే నిర్వహిస్తారు. అయితే.. ఈ సర్వేలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఎలాంటి వివరాలను ప్రజలు ఇవ్వాలి? ఎలాంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు? అనే విషయాలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. దీనిపై తాజాగా బీసీ కమీషన్ చైర్మన్ నిరంజన్ స్పష్టత ఇచ్చారు.
ఈ సర్వేలో ప్రధానంగా ప్రధాన కులం పేరు, ఉపకులం పేరు, ఆధార్ కార్డు నంబర్, మొబైల్ నంబర్, ఇంటి అడ్రస్, భూమి ఉంటే దానికి సంబంధించిన వివరాలు, అలాగే వాహనాలు.. బైక్, కారు, సైకిల్ ఇలాంటి ఉన్నా వాటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ భూమి లేకుంటే.. ఏం పని చేస్తారు, సొంత ఊళ్లోనే ఉంటున్నారా? పని కోసం ఎక్కడి వలస వెళ్లారు? అక్కడ ఏం పని చేస్తున్నారు? సంపాదన ఎంత? వలస వెళ్లిన చోట సొంతిళ్లా? అద్దెకు ఉంటున్నారా? కుటుంబంలో ఎంత మంది పనిచేస్తారు? మొత్తం కుటుంబం ఆదాయం ఎంత? ఇలా అనేక విషయాలు సర్వే ఫామ్‌లో పొందుపర్చారు. సర్వే పూర్తి అయిన తర్వాత.. తెలంగాణ వ్యాప్తంగా నమోదు చేయపబడిన వివరాలను ప్రజల ముందు ఉంచుతామని కూడా ప్రభుత్వం వెల్లడించింది.
అయితే.. ఈ కులగణనలో ఎవరైన కావాలని ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినా? లేక వివరాలు నమోదు చేసే వ్యక్తులు తప్పుడు సమాచారం నమోదు చేసినా? వారిపై కఠిన చర్యలు, క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని బీసీ కమీషన్ ఛైర్మన్ నిరంజన్ హెచ్చరించారు. తమ వివరాలు తప్పుగా నమోదు చేయమని ఏ అధికారిని కూడా ప్రజలు డబ్బు ఆశ చూపించకూడదని, అలాగే అధికారులు సైతం ప్రజలను ఇబ్బందికి గురి చేయొద్దని సూచించారు. కులగణన కోసం వచ్చే అధికారులను ఎన్యుమరేటర్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ ఎన్యుమరేటర్లు ప్రజలతో ప్రశాంతంగా మాట్లాడి.. వివరాలు సేకరించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. గతంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే విధంగానే ఈ కులగణన సర్వే ఉంటుందని ప్రభుత్వ పెద్దలు వెల్లడించారు. కులగణన సమయంలో ఎవరు కూడా తప్పుడు సమాచారం ఇవ్వకుండా.. ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
కులగణన అంటే ఏమిటి?
దేశంలో ప్రతి సంవత్సరం జనాభా సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అయితే దేశంలో పదేళ్ళకు ఒకసారి జనాభాను లెక్కిస్తుంటారు. అందులో దళితులు, ఆదివాసీల సంఖ్యపై స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ.. ఓబీసీ తో పాటు ఏయే కులాల వారు ఎంత మంది ఉన్నారన్న సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు ఉద్దేశించబడినదే కులగణన. భారత్‌లో బ్రిటిష్ పాలనా కాలంలో (1872)లో, జనాభా లెక్కలు మొదలయ్యాయి. బ్రిటీష్ వలస ప్రభుత్వ పాలనలో 1931 జనగణనతో పాటు ఇతర సమాచారం ఆధారంగా దేశంలో 52 శాతం ఓబీసీ జనాభా ఉన్నట్లు మండల్ కమిషన్ నిర్ధారించింది. ఆ సమయంలో ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ కమీషన్ సిఫార్సులను 60 ఏండ్ల తర్వాత 1989 లో వీపీ సింగ్ ప్రభుత్వం ఆమోదించింది. 2018లో పార్లమెంట్ సాక్షిగా అప్పటి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత దేశంలో రాబోయే జనగణనలో కులగణన తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల కులగణనపై పెద్ద ఎత్తన తమ గళం వినిపిస్తుంది. ప్రజాస్వామ్య భారతంలో వెనుకబడిన తరగతులకు తగిన ప్రాతినిధ్యం లభించినపుడే సామాజిక న్యాయం అనే మాటకు సంపూర్ణత చేకూరుతుంది. ఇది సాకారం కావాలంటే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కులాల వారీగా జనగణన ఒక్కటే పరిష్కారం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నేతలు కూడా కులగణనకు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణలో కూడా ప్రభుత్వం కులగణన కార్యక్రమాన్ని నవంబర్ 6 నుంచి ప్రారంభించనుంది.
కులగణన అవసరం ఏంటీ?
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏ కులంలో ఎంతమంది ఉన్నారు. వాళ్లలో ఎంతమంది నిరుపేదలు పేదలు..ఎంతమంది ఉన్నత వర్గానికి చెందిన వారు.. ఎంతమంది నిరక్ష్యరాస్యులు ఉన్నారు అన్న విషయంపై సమగ్ర సమాచారం తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఎంతమందికి దక్కాల్సింది దక్కడం లేదు.. అనే లెక్క తీసి.. పక్కా రిపోర్ట్‌ను అవసరం ఉందని ఇటీవల డిమాండ్ పెరుగుతూ వస్తుంది. విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో ప్రస్తుతం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, బీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పిస్తు విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీలకు పూర్తి జనాభాకు తగిన నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇస్తే.. బీసీలకు మాత్రం వాళ్ల జనాభాలో సగం నిష్పత్తికే రిజర్వేషన్ ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో వెనక బడిన వర్గాల జనాభా బాగా పెరిగిపోయింది. వారిలో జనాభాకు తగినంత ప్రాతినిధ్యం (రిజర్వేషన్లు) కల్పించడం లేదన్నది నిపుణుల వాదన. దేశంలో సగం కన్నా ఎక్కువ జనాభా ఓబీసీలేనని పలు ఎన్జీవోలు చేపట్టిన సర్వేల్లో వెల్లడైంది. దీని ప్రకారం 50 శాతం రిజన్వేషన్లు ఓబీసీలకు కల్పించాలని వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా జరగాలంటే దేశంలో కులగణన జరిగి తీరాల్సిందే అని డిమాండ్ వినిపిస్తుంది. అప్పడే.. వెనుకబడిన వర్గానికి ఎంత రిజర్వేషన్ కేటాయించాలన్న విషయంపై స్పష్టత వస్తుందని నిపుణుల అభిప్రాయం. జనగణన వల్ల రిజర్వేషన్లతో పాటు సంక్షేమ పథకాల అమలు కూడా సరిగా జరుగుతాయని నిపుణులు అంటున్నారు.
కులగణన వల్ల ప్రయోజనం ఏంటి..?
ప్రజాస్వామ్య దేశంలో వెనుకబడిన తరగతులకు తగినంత ప్రాతినిద్యం లభించినపుడే సామాజిక న్యాయం అనే మాటకు సంపూర్ణ అర్థం.
ఇది సాకారం కావాలంటే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కులాల వారీగా జనగణన ఒక్కటే పరిష్కారం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక రాష్ట్రంలో కులగణన వల్ల ఏ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎంత మంది నివసిస్తున్నారన్న విషయం తెలుస్తుంది. దీని వల్ల సామాజిక వర్గాలు, మతాల వారీగా రాష్ట్రంలో ఎంత మంది నివసిస్తున్నారన్నదానిపై ఓ క్లారిటీ వస్తుంది. అంతేకాదు ఆయా వర్గాలకు చెందిన వారి స్థితి గతులు, ఆర్థిక పరిస్థితి ఏంటీ అన్నదాని గురించి పూర్తిగా ప్రభుత్వానికి తెలుస్తుంది. వారి కోసం ఏయే పథకాలు అమలు చేయాలన్న విషయంలో ప్రభుత్వానికి ఒక స్పష్టత వస్తుంది. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు తగిన రీతిలతో వ్యూహాలు రచించే అవకాశం పార్టీలకు ఉంటుంది. అసలు ఏ కులం పరిస్థితి ఏంటీ? ఆయా కులాల్లో పేదల శాతం ఎంత? ఏ కులం వారు ఏ ప్రాంతంలో ఆర్థికంగా బలంగా ఉన్నారు? ఏ కులం వారు ఆర్థిక రంగంలో డీలా పడిపోయారు? అన్న విషయాలు తెలిస్తే రిజర్వేషన్లతో పాటు సంక్షేమ పథకాల అమలు కూడా సక్రమంగా అమలు పరిచే అవకాశం ఉంటుంది. జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో వెనకబడిన వర్గాలకు తగిన ప్రాధాన్యత లభిస్తుంది. ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు అందుకోలేని ఎన్నో వందల కులాలను వెలుగులోకి తీసుకురావడానికి వీలు ఉంటుంది. నిరుపేదలు, వెనుకబడిన వర్గాల వారికి సాంత్వన చేకూరుతుంది. సంక్షేమం పేరిట ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఖర్చు లెక్క తేలుతుంది. ప్రభుత్వ పథకాలను అవసరమైన వారికి చేరవేయడంతోపాటు పథకాలను మెరుగ్గా సిద్ధం చేయడానికీ కుల గణన ఉపయోగపడుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుంది. కులగణన వల్ల ప్రతి కులం జనాభా ఎంత అనేది తెలుస్తుంది.
కులగణన వల్ల నష్టం ఏంటీ?
దేశంలో కులగణనను చేపడితే సున్నితమైన అంశాలను తిరగదోడినట్లు అవుతుందని.. ఇది భవిష్యత్ లో మనుల మధ్య పెను చిచ్చు పెట్టే అవకావశం ఉందని కొన్ని వర్గాలు అంటున్నాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ఇప్పటికే సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని కొందరు నిపుణులు గుర్తుచేస్తున్నారు. కులగణన తర్వాత కొత్త రిజర్వేషన్లకు డిమాండ్లు కూడా పెరుగుతాయనే ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. కులగణన వల్ల హిందువుల ఓట్లలో చీలికలు వచ్చి వర్గ పోరుకు దారి తీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా జనగణన చేపడితే ఇప్పటి వరకు అనధికారింగా ఉన్న ఓబీసీల ఆదిక్యత అధికారికంగా మారుతుందని, ఓబీసీల సంఖ్య పెరిగితే, రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్ పెరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే గనక జరిగితే… రాజకీయంగా, సామాజికంగా సమీకరణలు పూర్తిగా దెబ్బతింటాయని కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కులగణన వల్ల సమాజంలో కుల వ్యవస్థ బలోపేతం అవుతుందని, కులాలవారీగా ప్రజలను వర్గీకరించడం అంటే వ్యక్తిగత హక్కులు హరించడమే అని, కులాలను నిర్వచించడం కష్టమని, ఇది సమాజంలో గందరగోళం, వివాదాలకు దారితీసి దేశ సమగ్రతకు భంగం కలిగిస్తుందనే వాదన కూడా ఉంది.