iDreamPost
android-app
ios-app

Captain Varun Singh – ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరో విషాదం

Captain Varun Singh – ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరో విషాదం

ఆర్మీ హెలికాప్టర్‌ కూలిన దుర్ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న గ్రూప్‌ కెప్టన్‌ వరుణ్‌సింగ్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన వరుణ్‌ సింగ్‌.. ఈ రోజు కన్నుమూశారు.

ఈ నెల 8వ తేదీన త్రివిధ దళాల అధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్, ఆయన సతీమణి మధుళిక సహా 14 మంది ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ తమిళనాడులోని ఊటి కొండల్లో కున్నూరు సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆ రోజే 13 మంది మృతి చెందారు. హెలికాప్టర్‌ కూలిన తర్వాత మంటలు చెలరేగాయి. బిపిన్‌ రావత్‌ దంపతులు, మరో జవానును మాత్రమే గుర్తించగలిగిన స్థితిలో ఉన్నారు. మిగతా వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా మారాయి. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా వారిని గుర్తించిన ఆర్మీ.. సైనిక లాంఛనాలతో వారి వారి స్వస్థలాలలో అంత్యక్రియలు పూర్తి చేసింది.

ఈ ప్రమాదంలో గ్రూప్‌ కెప్టన్‌ వరుణ్‌ సింగ్‌ ఒక్కరే ప్రాణాలతో మిగిలారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను స్థానిక మిలటరీ ఆస్పత్రికి, అక్కడ నుంచి బెంగుళూరు ఆస్పత్రికి తరలించారు. వరుణ్‌ సింగ్‌ను కాపాడేందుకు అత్యుత్తమ వైద్యాన్ని అందించారు. వారం రోజుల పాటు చికిత్స తర్వాత.. వరుణ్‌ సింగ్‌ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో కొన ఊపిరితో భయటపడిన వరుణ్‌ సింగ్‌ కూడా చనిపోవడం విషాదాన్ని నింపింది.

Also Read :  సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దుర్మరణం