iDreamPost
iDreamPost
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది . వారం క్రితం వరకూ అమరావతి భూములిచ్చిన వారి పోరాటంగా మాట్లాడిన టీడీపీ గత వారం నుండి అమరావతి ప్రాంతంలో జరిగిన మరణాల గురించి మాట్లాడటం మొదలెట్టింది . యధావిధిగా టీడీపీ అనుకూలమని పేరుబడ్డ కొన్ని పత్రికల్లో ఆ మరణాలు రాజధాని కోసమే అని వార్తలొచ్చాయి .
కొన్ని చోట్ల టీడీపీ నాయకులు వెళ్లి పరామర్శించారు కూడా . అయితే అవన్నీ వృద్ధుల సహజ మరణాలు అని , ఒక వైపు అమరావతి కోసం రైతులు ధర్నా అని వార్తలు రాస్తూ రాజధాని కోసం ఒక్క సెంటు భూమి కూడా లేని రైతు కూలీ గుండె ఆగి చనిపోయాడని రాయటం సహజ మరణాన్ని అమరావతి ఉద్యమం కోసమే అని చర్చ జరుగుతుంది. ఆ వార్తల్లో, వాదనల్లో నిజా నిజాలు పూర్తిగా వెల్లడి కాకముందే ఈ రోజు మరో సంఘటన జరిగింది .
Read Also: రాజధానిపై అసత్య వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రాజధాని ప్రాంతంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న సమాచారంతో టీడీపీ సోషల్ మీడియా ఓ వీడియో వైరల్ చేసింది. అయితే ఆ వీడియో తమిళనాడులోని మదురైలో తన భార్య మరణం తట్టుకోలేక సూసైడ్ చేసుకొన్న శక్తి అనే యువకుడిదని తెలియజేస్తూ సంబంధిత వార్త పత్రికల సమాచారం, దుర్ఘటన తాలూకూ ఒరిజినల్ వీడియో క్లిప్స్ తో సొషల్ మీడియా బయటపెట్టింది. ఆ వీడియో,తరువాతి రోజు అంటే 08-Jan-2019 నాడు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే దేశంలో జరిగిన దుర్ఘటనలు,ఆత్మహత్యలను అమరావతి కోసమే అని టీడీపీ ప్రచారం చేస్తున్న వైనం బయటపడుతుంది.
కాలం మారింది సమాచార సాధనాలు తక్కువగా ఉన్న రోజుల్లో,ఉన్న పత్రికల్లో ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న రోజుల్లో లాగా ఇప్పుడు అష్టమ,అర్ధ సత్య ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టటం సాధ్యం కాదు… సోషల్ మీడియా ద్వారా ప్రజలు క్షణాల్లో ప్రపంచ సమాచారం తెలుసుకొంటున్న 2020 రోజుల్లో పాతకాలపు రాజకీయ ఎత్తుగడలు పనిచేయవు…