iDreamPost
android-app
ios-app

కుస్తీ వీరుడు బంగారు మెడల్ తెస్తాడా?.

కుస్తీ వీరుడు బంగారు  మెడల్ తెస్తాడా?.

టోక్యో ఒలంపిక్స్ లో పథకాలు గెలవడంలో భారత్ వెనుకంజలో ఉన్న భారత ఆటగాళ్లు మాత్రం 130 కోట్ల భారతీయుల మనసులు గెలుచుకున్నారు.పథకాల పట్టికలో 65 స్థానంలో ఉన్న భారత్ ఒకప్పుడు ఒలంపిక్స్ లో లీగ్ దశలోనే ఇంటికి వచ్చే భారత్ ఇప్పుడు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో సెమి ఫైనల్, ఫైనల్ వరకు చేరుతోంది.

మీరాబాయి చాను, పీవీ సింధు, లవ్లీనా బోర్గహైన్ మెడల్ సాధించగా పురుషుల, మహిళల హాకీ జట్టు సెమీఫైనల్ వరకు వెళ్లాయి. డిస్కస్ త్రో లో కమల్ ప్రీత్ కౌర్ ఫైనల్ కు చేరి తృటిలో పథకం మిస్ అయింది. జావెలింగ్ త్రో లో నీరజ్ చోప్రా ఫైనల్ కి చేరాడు. అర్చరీలో అథాను దాస్,దీపికా కుమారి అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇలా భారత ఆటగాళ్లు టోక్యో ఒలింపిక్స్ లో తమ అద్బుతమైన అతను ప్రదర్శించారు. ఒలింపిక్స్ లో పాల్గొనే ఆటగాళ్లలో క్రీడాస్ఫూర్తి నింపేందుకు మెడల్స్ సాధించే అటగాళ్లే ఈసారి ఆగస్ట్15 అతిధులు అని మోడీ ప్రకటించాడు.

ఒలింపిక్స్ లో అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ చేరిన కుస్తీ వీరుడు రవి కుమార్ దహియా వైపే భారత్ చూపు ఉంది. సెమిఫైనల్ లో కజికిస్తాన్‌కి చెందిన నురిస్లామ్ సనయెవ్‌తో ఓడించి ఫైనల్ చేరాడు.13వ రోజు 57కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో రవికుమార్ దహియా తన ప్రత్యర్థిపై బ్యాక్ అండ్ బ్యాక్ బౌట్ లో రెచ్చిపోయాడు. తొలుత కొంత వెనుకబడ్డట్టు అనిపించిన తరువాత పుంజుకుని వరుస పాయింట్లతో ప్రత్యర్థిని చిత్తు చేసి సెమీఫైనల్ లో గెలిచి ఫైనల్ చేరి భారత్ కు మరో పథకం ఖాయం చేసాడు రవికుమార్.

మొదటి పీరియడ్ లో 2-1తో ఆధిక్యం కనబరిచాడు రవి కుమార్.కానీ బ్రేక్ తరువాత కజకిస్తాన్ ఆటగాడు సనయెవ్‌ అనూహ్యంగా పుంజుకోని ఒకేసారి8పాయింట్లు సాదించడంతో 2-9 అనూహ్యంగా రవి కుమార్ పై ఆధిక్యం సాధించాడు. వెంటనే కోలుకున్న రవి మూడు, రెండు పాయింట్లు సాధించి 7-9 ఆధిక్యన్ని తగ్గించాడు. తరువాత సనయెవ్‌ ఏదశలో అవకాశం ఇవ్వకుండా రవికుమార్ 3 పాయింట్లు సాధించి సెమీస్ లో గెలిచి భారత ఫైనల్ ఆశలను నిలిపాడు. క్వార్టర్స్ ఫైనల్ మ్యాచులో బల్గెరియాకు చెందిన జార్గీ వెంగెలోవ్‌ ను చిత్తు చేసాడు.

ఇంతకముందు సుశీల్‌ కుమార్‌, యోగేశ్వర్‌ దత్‌లు రెజ్లింగ్‌ విభాగంలో భారత్‌కు పతకాలు అందించారు. అయితే యోగేశ్వర్‌ దత్‌ లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం దక్కించుకోగా.. సుశీల్‌ కుమార్‌ మాత్రం ఫైనల్లో ఓడిపోయి రజతం దక్కించుకున్నాడు. తాజాగా సుశీల్ కుమార్‌ తర్వాత ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ విభాగంలో ఫైనల్‌ చేరిన రెండో వ్యక్తిగా రవికుమార్‌ దహియా నిలిచాడు.

రవికుమార్ ప్రస్థానం..

రవికుమార్ దహియా సొంతూరు హర్యానాలోని సోనిపట్ జిల్లాలో ఉన్న నాహ్రి. దేశంలోని టాప్ రెజ్లర్లయిన యోగేశ్వర్ దత్‌, ఫోగాట్ అక్కచెళ్లెల్లు, భజరంగ్ పూనియాలాంటి వాళ్లదీ ఈ హర్యానానే. అక్కడి గడ్డపై పుట్టినవాళ్లకు స్వతహాగా రెజ్లింగ్‌పై మోజు పుడుతుందేమో. రవికుమార్ కూడా 10 ఏళ్ల వయసులోనే రెజ్లింగ్ వైపు చూశాడు. రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సుశీల్‌కుమార్ కోచ్ సత్పాల్ సింగ్ దగ్గరే రెజ్లింగ్ ఓనమాలు నేర్చుకున్నాడు. నిజానికి రవి దహియా రెజ్లింగ్‌లోకి రావడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అయినా అతడే పట్టుపట్టి రెజ్లింగ్ నేర్చుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు.

2019 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించడం ద్వారా రవికుమార్ దహియా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అంతకుముందు 2015 జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లోనూ అతడు సిల్వర్ మెడల్ గెలిచాడు. 2017లో మోకాలి గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. 2018లో అండర్ 23 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ గెలిచి తన రాకను బలంగా చాటాడు. 2019లో ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో తొలిసారి సీనియర్ స్థాయిలో మెడల్ గెలిచాడు. అప్పటి నుంచీ 57 కేజీల కేటగిరీలో నిలకడగా రాణిస్తున్నాడు.

ఫైనల్ కు చేరిన రవి కుమార్ పై యావత్ దేశం మొత్తం ప్రశంసలు కురిపిస్తుంది.ఫైనల్ లో గెలిచిన ఓడిన పథకం ఖాయం అయినా ఫైనల్ లో రష్యా రెజ్లర్ జార్ ఉగ్వేవ్ తలపడనున్నాడు. ఫైనల్ నెగ్గి భారత్ కు గోల్డ్ మెడల్ అందించాలని యావత్ భారత్ కోరుకుంటుంది.